Tirumala: తిరుమలలో ఉగ్రవాదుల కదలికలపై మెయిల్‌.. అప్రమత్తమైన పోలీసులు.. విచారణలో ఏం తేలిందంటే..

|

May 02, 2023 | 12:00 AM

తిరుమలలో ఉగ్రవాదుల కదలికలపై మెయిల్‌ వచ్చింది. ఈ మెయిల్ తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు తిరుమల తిరుపతి దేశస్థానం (టీటీడీ)కి మెయిల్ పంపించారు. దీంతో తిరుమల పోలీసులు అప్రమత్తం అయ్యారు. అడుగడుగునా భారీగా తనిఖీలు నిర్వహించారు..

Tirumala: తిరుమలలో ఉగ్రవాదుల కదలికలపై మెయిల్‌.. అప్రమత్తమైన పోలీసులు.. విచారణలో ఏం తేలిందంటే..
Tirumala Tirupati
Follow us on

తిరుమలలో ఉగ్రవాదుల కదలికలపై మెయిల్‌ వచ్చింది. ఈ మెయిల్ తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు తిరుమల తిరుపతి దేశస్థానం (టీటీడీ)కి మెయిల్ పంపించారు. మెయిల్‌ రావడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. తిరుమలలో టీటీడీ విజిలెన్స్‌, పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. చివరకు ఇది ఫేక్‌ మెయిల్‌గా తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మెయిల్‌పై తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి స్పందించారు. ఇది అకతాయి మెయిల్‌గా భావిస్తున్నామని అన్నారు.

భక్తులు అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని ఆయన సూచించారు. మెయిల్‌ విషయమై విచారణ జరుపుతున్నామని అన్నారు. తిరుమలలో భద్రత పటిష్టంగా ఉందని ఎస్పీ పేర్కొన్నారు. ఫేక్‌ మెయిల్‌లపై భక్తులు ఆందోళనకు గురి కావద్దని, టీడీడీలో ఎప్పటికప్పుడు పోలీసుల నిఘా ఉంటుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి