AP News: తిరుమలలో ఫొటోషూట్‌ వ్యవహారం.. దువ్వాడ-దివ్వెలకు నోటీసులు..

|

Oct 20, 2024 | 12:18 PM

దువ్వాడ శ్రీనివాస్. దివ్వల మాధురి.. వీళ్లిద్దరి రొమాంటిక్ క్రైమ్ కహానీ మొన్నటిదాకా ఉత్తరాంధ్రకే పరిమితం. తర్వాత ఇంటిగుట్టు రచ్చకెక్కి పొలిటికల్‌గా కాకరేపి, ఇప్పుడు మిగతా కార్నర్స్‌ని కూడా హీటెక్కిస్తూ తెలుగు నాట ట్రెండ్‌లో కొనసాగుతోంది. ఇటీవల తిరుమలలో దువ్వాడ జంట చేపట్టిన విన్యాసం.. మరో ఇంట్రస్టింగ్ మలుపు తీసుకుంది.

AP News:  తిరుమలలో ఫొటోషూట్‌ వ్యవహారం.. దువ్వాడ-దివ్వెలకు నోటీసులు..
Duvvada Srinivas - Divvala Madhuri
Follow us on

దువ్వాడ శ్రీను, మాధురి ఫొటోషూట్‌పై విచారణ స్పీడప్ చేశారు తిరుమల వన్‌టౌన్ పోలీసులు. ఇద్దరికీ 41ఏ నోటీసులు జారీ చేశారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో.. తిరుమలలో ఫొటోషూట్ చేయడంపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.  భక్తుల మనోభావాలను దువ్వాడ, మాధురి దెబ్బతీశారని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. దీంతో ఈనెల 10వ తేదీన కేసు ఫైల్ చేసిన పోలీసులు..
దువ్వాడ శ్రీను, మాధురి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

4వ తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో దువ్వాడ శీనుతో కలిసి మాధూరి రీల్స్‌ చేసినట్టు.. ఫొటో షూట్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. TTD AVSO మనోహర్ ఇచ్చిన ఫిర్యాదుతో 3 సెక్షన్ల కింద వారిపై కేసులు పెట్టారు. ఆలయం వద్ద భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాధురి, శ్రీను ప్రవర్తించారనేదానిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. తిరుపతి నుంచి ఒక పోలీస్‌ టీమ్‌ను శ్రీకాకుళం జిల్లా టెక్కలికి పంపారు. దివ్వల మాధురికి నేరుగా 41 నోటీసులు అందించబోతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వ్యక్తిగత విషయాలు మాట్లాడినందుకు, రీల్స్‌ చేసినందుకు, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినందుకు వివరణ ఇవ్వాలని కోరనున్నారు.

అసలు ఏం జరిగింది… 

సడన్‌గా తిరుమల టూరేసి, శ్రీవారి దర్శనం తర్వాత మాడ వీధుల్లో తిరుగాడుతూ ఫోటోలకు ఫోజులిస్తూ, మీడియాతో మాట్లాడుతూ మళ్లీ హెడ్‌లైన్ వార్తల్లోకెక్కింది దువ్వాడ జంట. దంపతులు కాని దంపతులు.. ఆది దంపతుల్లా ఇలా రెచ్చిపోయారేంటి? పవిత్ర క్షేత్రంలో.. అదేం పని మాధురీ!? అనే సూటిపోటి విమర్శలతో సెన్సిటివ్ ఇష్యూను కాస్తా సాలిడ్‌గా మార్చేసింది సోషల్ మీడియా. కట్‌చేస్తే దువ్వాడ జంటపై టీటీడీ యాక్షన్ పార్ట్ షురూ ఐంది. తిరుమలలో రీల్స్ చేశారని, మాడవీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడారని, ఆవిధంగా నిబంధనలు ఉల్లంఘించారని అభియోగాలు మోపుతూ మాధురిపై మూడు కేసులు నమోదయ్యాయి.

విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామంటున్న టీటీడీ.. ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది సస్పెన్స్‌గా మారింది. కానీ.. తిరుమలలో రీల్స్ చేయనేలేదని, కొందరు తమతో ఫోటోలు తీసుకున్నారని, మీడియాతో మితిమీరి మాట్లాడలేదని క్లారిటీ ఇస్తోంది దువ్వాడ జంట. మాడవీధుల్లో ఏం మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదు మాకు తెలీదా అంటూ రివర్స్‌ కౌంటర్లు కూడా.  తమపై కేసులు పెట్టడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని కూడా అనుమానిస్తోంది దువ్వాడ జంట.

మొత్తం ఎపిసోడ్‌లో మాధురికి పూర్తి డిఫెన్స్‌గా నిలబడ్డారు దువ్వాడ శ్రీనివాస్. తమను ప్రశ్నించేవాళ్లను, తమపై కేసులు పెట్టిన వాళ్లను లాజిక్కులతో కొడుతున్నారు దువ్వాడ. ఇదిలా ఉంటే.. మాధురి ఉదంతాన్ని మరింత రక్తి కట్టిస్తూ హిందూ సంఘాలు సీన్లోకొచ్చేశాయి. దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి.. మాడవీధులు, పుష్కరిణి వద్ద ఫోటో షూట్లు చేస్తూ ఘోర అపచారానికి పాల్పడ్డారనేది జన జాగరణ సమితి ఆరోపణ. వీళ్లు మళ్లీ తిరుమలకు రాకుండా శాశ్వతంగా బహిష్కరించాలని టీటీడీకి డిమాండ్లు కూడా వస్తున్నాయి.  వీళ్లే సమస్యల్ని వెతుక్కుంటూ వెళ్తున్నారా.. సమస్యలే వీళ్లను వెదుక్కుంటూ వస్తున్నాయా.. అంతుబట్టని పరిస్థితి. సో.. దువ్వాడ ఫ్యామిలీ సర్కస్‌లో మరికొన్ని ఇంట్రస్టింగ్ ఎపిసోడ్ ప్రజంట్ షురూ అయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..