ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడి, అత్యంత పాశవికంగా హత్యకు పాల్పడ్డారు. ఈ దారుణమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడియం ప్రాంతంలో బుర్రిలంక నర్సరీలో ఓ వివాహిత పనిచేస్తుంది. పనులు ముగించుకుని వెళ్తుండగా దారుణం జరిగింది. ఈ ఘటనకు పాల్పడ్డ యువకులంతా 28 ఏళ్ల లోపు యుకులే కావడం విశేషం.
అక్టోబర్ 15 వ తేదీన నర్సరీ లో పని ముగించుకుని ఇంటికి వెళ్తోంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గంజాయి సేవించి మత్తులో ఉన్న నలుగురు యువకుల కంటపడింది. వివాహితను బలవంతంగా చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లిన యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి, పక్కనే ఉన్న కాలువలో పడేశారని పోలీసులు తెలిపారు.
అయితే, అక్టోబర్ 15న చొప్పెల్ల లాకుల వద్ద అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం కాలువలో లభించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహానికి స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చేయించారు. ఈ రిపోర్ట్‌లో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితులను సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. బుర్రిలంకకు యేసులోకి జయప్రసాద్, వెలుబుడి ప్రవీణ్, పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్, లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరంతా మద్యం మత్తులో ఆమెపై క్రూరంగా లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత హతమార్చారని తేలింది.
స్థానిక నర్సరీల వద్ద మృతురాలి కుమారుడి స్నేహితులకు సంబంధించిన నల్లపూసల దండ, గాజులు, రుమాలు, పిన్నులు కనిపించాయి. ఈ ఘటన జరిగినప్పటి నుంచి నర్సరీల్లో పనులకు హాజరవ్వని వారి ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీశారు. దేవర యేసు పేరు తెరపైకి వచ్చింది. అతడు తెలిపిన వివరాలతో మిగతా ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నలుగురిని గురువారం(అక్టోబర్ 31) రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ భవ్యకిశోర్ తెలిపారు. నిందితులు నిత్యం గంజాయి, మద్యం మత్తులో ఉంటారని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. యేసు పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్యకు గురైన వివాహిత ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మహిళా(42) కుటుంబ సభ్యులను పరామర్శించారు స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కడియం లో ఇలాంటి సంస్కృతి లేదని, గంజాయి విచ్చలవిడిగా తీసుకోవడం వలన ఎలాంటి ఘటన జరిగాయన్నా ఎమ్మెల్యే. నిందితులు ఎంతటి వారైనా జైలులో నుండి బయటకు రాకుండా చేస్తానన్నారు బుచ్చయ్య చౌదరి. అనాథలుగా మిగిలిన బాధితురాలి కుమారుడు, కూతురిని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందన్నారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.
అత్యాచారం వచ్చే ఘటన రాజకీయ రంగు పులుకుంది…. 15 రోజుల తర్వాత విషయం బయటకు రావడంతో నేతలు బాధితులకు ఇంటికి పరామర్శికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మహిళ కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించారు. అత్యాచారం హత్యకు గురైన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మాజీమంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు.
ఇదిలావుంటే, ఒడిశాలోని పర్లాణెముండి ప్రాంతానికి చెందిన దంపతులు చాలా కాలం క్రితం కడియం మండలంలోని బుర్రిలంక గ్రామానికి వచ్చి, నర్సరీల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అక్టోబరు 15న వివాహిత నర్సరీలో పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్తుండగా.. బుర్రిలంకకు చెందిన దేవర యేసు (26), వెలుబుడి ప్రవీణ్ (21), లోకిన జయప్రసాద్ (19), పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్ (22) అడ్డుకుని బలవంతం చేశారు. బాధితురాలు ప్రతిఘటించడంతో సమీపంలోని మొక్కల్లోకి లాక్కెళ్లి తువ్వాలును నోట్లో కుక్కారు. చేతులు, కాళ్లు పట్టుకుని ముక్కు మూసేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. నిందితులు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. మృతదేహాన్ని సమీపంలోని పంటకాలువలో పడేసినట్లు వెల్లడైంది. మహిళ మృతి దేహానికి నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు నిందితులు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..