Watch Video: తాడిపత్రిలో తనకు శత్రువులే లేరన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. పెద్దారెడ్డిపై కీలక వ్యాఖ్యలు..

|

Jul 19, 2024 | 8:37 PM

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే.. అసలు సినిమా చూపిస్తానంటూ ఫైర్‌ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యాక్షన్‌ చేస్తా అంటున్నారు.. ఆయన నుంచి మాకు ప్రాణహాని ఉందంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి.

Watch Video: తాడిపత్రిలో తనకు శత్రువులే లేరన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. పెద్దారెడ్డిపై కీలక వ్యాఖ్యలు..
Jc Prabhakar Reddy
Follow us on

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే.. అసలు సినిమా చూపిస్తానంటూ ఫైర్‌ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యాక్షన్‌ చేస్తా అంటున్నారు.. ఆయన నుంచి మాకు ప్రాణహాని ఉందంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి. గతంలోనూ తమ మనుషులపై దాడి చేశారని.. ఇప్పుడూ మళ్లీ దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి కాదు అసలు ఏపీ నుంచే బహిష్కరించాలన్నారు జేసీ.

తాడిపత్రిలో తనకు శత్రువులే లేరన్నారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి. వైసీపీలో ఓ నలుగురైదుగురు మాత్రం తనను ఓ శత్రువులా చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే అసలు సినిమా చూపిస్తానన్నారు. పెద్దారెడ్డి జీవితం మొత్తం గన్‌మెన్‌లతోనే సాగిందన్న ఆయన.. తనపై ఎవరెన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. మొత్తంగా.. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. మరి జేసీ వ్యాఖ్యలపై పెద్దారెడ్డి ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..