AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: 7 రోజుల క్రితమే పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే?

వారం క్రితమే వాళ్లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. నిండు నూరేళ్లూ కలిసి బతకాలని ఏడడుగులు వేశారు. కానీ ఆ జంటను చూసి కాలం ఓర్వలేకపోయింది. నారాయణ తన స్నేహితుడితో కలిసి ఓ వివాహ వేడుకకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Andhra News: 7 రోజుల క్రితమే పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే?
Srikakulam Road Accident
Anand T
|

Updated on: Sep 06, 2026 | 12:56 PM

Share

పెళ్లైన వారం రోజులకే రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతకవిటి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నారాయణరావు అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వారం క్రితం పెళ్లి జరిగింది. అయితే శనివారం బంధువులకు సంబంధించిన ఓ పెళ్లి వేడుక ఉండడంతో నారాయణ తన స్నేహితుడితో కలిసి పొందూరు మండలం రాపాక గ్రామానికి కొత్త బైక్‌పై వెళ్లాడు. పెళ్లి ముగిసిన తర్వాత ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా.. కొత్త బండికి సంబంధించిన పేపర్లు తీసుకెళ్దామని శ్రీకాకుళంలోని బైక్ షోరూంకు వెళ్లారు.

అక్కడ షోరూంలో డాక్యుమెంట్లు తీసుకొని ఇద్దరూ ఇంటికి బయల్దేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న బైక్ పొందూరు మండలం సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో నారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై వెనుక కూర్చున్న అతని స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు నారాయణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన కేవలం వారం రోజులకే భర్త చనిపోవడంతో అతని భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడుపుతాడనుకున్న కొడుకు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి అతని తల్లిదండ్రులు సైతం గుండె పగిలేలా రోదిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ కొబ్బరి పులిహోర తిన్నవాళ్లు రెసిపీ అడగకుండా ఉండలేరు
ఈ కొబ్బరి పులిహోర తిన్నవాళ్లు రెసిపీ అడగకుండా ఉండలేరు
7 రోజుల క్రితమే పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు..
7 రోజుల క్రితమే పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు..
వాట్సప్‌లోనే కరెంట్, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించవచ్చు..
వాట్సప్‌లోనే కరెంట్, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించవచ్చు..
పనిమనిషికి నెలకు లక్ష పైనే జీతం!
పనిమనిషికి నెలకు లక్ష పైనే జీతం!
నల్ల పిల్లి దారికి అడ్డంగా వస్తే దురదృష్టమా? సైన్స్ ఏం చెబుతోంది?
నల్ల పిల్లి దారికి అడ్డంగా వస్తే దురదృష్టమా? సైన్స్ ఏం చెబుతోంది?
తండ్రి ఆస్తి మొత్తం కొడుకుకే రాసిచ్చినప్పుడు కూతుళ్లు ఏం చేయాలి?
తండ్రి ఆస్తి మొత్తం కొడుకుకే రాసిచ్చినప్పుడు కూతుళ్లు ఏం చేయాలి?
మఖానా తింటే ఎముకలు, కండరాలకు ఏం జరుగుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
మఖానా తింటే ఎముకలు, కండరాలకు ఏం జరుగుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే కీరదోసను ఇలా ప్రయత్నించండి
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే కీరదోసను ఇలా ప్రయత్నించండి
నాపై అలాంటి ముద్ర వేశారు.. బిగ్ బాస్‏లో నేనేంటో చూపిస్తా..
నాపై అలాంటి ముద్ర వేశారు.. బిగ్ బాస్‏లో నేనేంటో చూపిస్తా..
40 ఏళ్ల వయస్సులో ఉద్యోగం మారేస్తే వడ్డీ కోల్పోతారా..?
40 ఏళ్ల వయస్సులో ఉద్యోగం మారేస్తే వడ్డీ కోల్పోతారా..?