వేప చెట్టులో వెలసిన అమ్మవారు..ఇదిగో సాక్ష్యం !

కడప జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటిముందున్న వేపచెట్టుకు స్థానికులంతా పసుపు, కుంకుమ, అగరుబత్తులతో పూజలు చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఆ చెట్టుకు తెల్లటి ద్రావకం వస్తున్నందున అక్కడి వారంతా దానిని వింతగా చూస్తున్నారు. వేపచెట్టు నుండి పాలు వస్తుండటం తప్పక అమ్మవారి మహిహ అని చుట్టుపక్కల మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఆ వేపచెట్టుకు పూజలు నిర్వహిస్తున్నారు. వేప చెట్టుకు పసుపు, కుంకుమతో పెట్టి గాజులు, నిమ్మకాలు కట్టి దీపాలు పెట్టారు. […]

వేప చెట్టులో వెలసిన అమ్మవారు..ఇదిగో సాక్ష్యం !
Follow us

|

Updated on: Oct 30, 2019 | 3:08 PM

కడప జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటిముందున్న వేపచెట్టుకు స్థానికులంతా పసుపు, కుంకుమ, అగరుబత్తులతో పూజలు చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఆ చెట్టుకు తెల్లటి ద్రావకం వస్తున్నందున అక్కడి వారంతా దానిని వింతగా చూస్తున్నారు. వేపచెట్టు నుండి పాలు వస్తుండటం తప్పక అమ్మవారి మహిహ అని చుట్టుపక్కల మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఆ వేపచెట్టుకు పూజలు నిర్వహిస్తున్నారు. వేప చెట్టుకు పసుపు, కుంకుమతో పెట్టి గాజులు, నిమ్మకాలు కట్టి దీపాలు పెట్టారు. చెట్టు నుంచి వచ్చే పాలను చేతితో తాకుతూ ప్రసాదంలా సేవిస్తున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అటుగా వచ్చి వెళ్లే ప్రతిఒక్కరూ ఆ వేపచెట్టును పూజించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సాక్ష్యత్తు అమ్మవారే ఆ వేపచెట్టులో వెలసిందనే నమ్మకంతోనే తాము పూజలు చేస్తున్నామని చెబుతున్నారు అక్కడి మహిళలు.