Andhra Pradesh: లక్షలు ఖర్చు చేసి.. పందెం కోళ్లను పెంచుతున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి! ఎందుకో తెలుసా?

| Edited By: Srilakshmi C

Jan 11, 2024 | 4:13 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొనిజర్ల గ్రామానికి చెందిన చుంచు ఉదయభాను అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మరి కొంతమంది స్నేహితుల సహకారంతో పందెం కోళ్ళ పెంపకం చేపట్టాడు. సంక్రాంతి సాంప్రదాయ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు ఖమ్మం జిల్లా, వైరా మండలం, ఖానాపురం గ్రామం సమీపంలోని మామిడి తోటలో పాతిక లక్షల రూపాయల ఖర్చుతో 100 రకాల పందెం కోళ్ళు పెంచుతున్నాడు..

Andhra Pradesh: లక్షలు ఖర్చు చేసి.. పందెం కోళ్లను పెంచుతున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి! ఎందుకో తెలుసా?
Software Employee Farming Roosters
Follow us on

ఖమ్మం, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొనిజర్ల గ్రామానికి చెందిన చుంచు ఉదయభాను అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మరి కొంతమంది స్నేహితుల సహకారంతో పందెం కోళ్ళ పెంపకం చేపట్టాడు. సంక్రాంతి సాంప్రదాయ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు ఖమ్మం జిల్లా, వైరా మండలం, ఖానాపురం గ్రామం సమీపంలోని మామిడి తోటలో పాతిక లక్షల రూపాయల ఖర్చుతో 100 రకాల పందెం కోళ్ళు పెంచుతున్నాడు. ఆంధ్రాలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడిపందాలకు యమ డిమాండ్ ఉంది. దీంతో తన స్వగ్రామమైన గంపలగూడెం మండలం నెమలి కొనిజర్లలో బొల్ల కరుణాకర్ రావు సారధ్యంలో నిర్వహించే కోడిపందాలకు 100 కోడిపుంజులను తయారు చేశాడు.

సంక్రాంతి సందర్భంగా నిర్వహించే సాంప్రదాయ ఆటలైన కోడి పందాలకు తమ తాత పాపయ్య, తన తండ్రి రవి శంకర్ ప్రసాద్ నుంచి సాంప్రదాయంగా పందెం కోళ్లను పెంచి, ఆటలు ఆడించడం జరుగుతుందని తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అయిన తన స్నేహితులు సుధీర్ ప్రసాద్ రమేష్, సతీష్‌ల సహకారంతో ప్రతి సంవత్సరం పందెం కోళ్ల పెంపకానికి 20 నుంచి 25 లక్షల ఖర్చు చేస్తున్నామని తెలిపారు. సొంతంగా పందెం కోళ్లను పెంచి, సాంప్రదాయ క్రీడను నిర్వహించుకోవడం ఆనందంగా ఉంటుందని అన్నారు. పందెం కోళ్ళు పెంపకానికి ఖానాపురం గ్రామ వాతావరణ పరిస్థితులు, మిషన్ భగీరథ వాటర్ అనుకూలంగా ఉందని, ఇక్కడ పెంచడం వల్ల కోళ్లకు ఎలాంటి అంటూ రోగాలు కలగలేదని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.