AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్లవారితే పెళ్లి.. రాత్రి వరకు పెళ్లి షాపింగ్.. ఉదయానికి పెళ్లి కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్!

కడప జిల్లాలో ఓ విచిత్ర ప్రేమ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడిని నమ్మించి, రూ.6 లక్షలు కాజేసిన మహిళ పెళ్లి రోజున ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైంది. ప్రేమ పేరుతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెల్లవారితే పెళ్లి.. రాత్రి వరకు పెళ్లి షాపింగ్.. ఉదయానికి పెళ్లి కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్!
Shocking Wedding Day Twist
Balaraju Goud
|

Updated on: Aug 21, 2026 | 2:49 PM

Share

కడప జిల్లాలో ఓ విచిత్ర ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. వేంపల్లి మండలంలో ప్రేమ పేరుతో ఓ యువకుడిని నమ్మించి భారీగా డబ్బులు తీసుకున్న ఓ మహిళ వ్యవహారం కలకలం రేపుతోంది. కడపకు చెందిన ఓ మహిళ.. వేంపల్లి మండలం కత్తులూరు గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం పెంచుకుంది. ప్రేమిస్తున్నానని నమ్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందామని యువకుడికి హామీ ఇచ్చిన సదరు మహిళ.. వివిధ అవసరాల పేరుతో అతడి నుంచి సుమారు రూ.6 లక్షలు తీసుకుని ముఖం చాటేసింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మడంతో యువకుడు కూడా ఆమెను పూర్తిగా విశ్వసించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెళ్లికి సంబంధించిన షాపింగ్‌ను కూడా మహిళ చేసింది. దీంతో పెళ్లి ఖాయమని భావించిన యువకుడి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పెళ్లి జరగాల్సిన రోజు ఉదయం సదరు మహిళ అకస్మాత్తుగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో యువకుడు షాక్‌కు గురయ్యాడు.

ఆమె కోసం ప్రయత్నించినా ఆచూకీ లభించకపోవడంతో చివరకు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను ప్రేమ పేరుతో నమ్మించి రూ.6 లక్షలు తీసుకుని మోసం చేసిందని పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. డబ్బులు ఎలా తీసుకుంది? మరెవరైనా ఈ వ్యవహారంలో ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెలుగులోకి రావాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
షుగర్ ధరల నుంచి బిగ్ రిలీఫ్.. మరికొద్ది రోజుల్లోనే..
షుగర్ ధరల నుంచి బిగ్ రిలీఫ్.. మరికొద్ది రోజుల్లోనే..
పెళ్లి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెళ్లి కూతురు జంప్!
పెళ్లి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెళ్లి కూతురు జంప్!
బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. కట్‌చేస్తే రంగంలోకి..
బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. కట్‌చేస్తే రంగంలోకి..
శ్రీవారికి మూడు నామాలు ఎందుకు? తిరుమల వెంకటేశ్వరుడి తిరునామం..
శ్రీవారికి మూడు నామాలు ఎందుకు? తిరుమల వెంకటేశ్వరుడి తిరునామం..
వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్.. మీ పిల్లలకు కూడా పెట్టండి!
వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్.. మీ పిల్లలకు కూడా పెట్టండి!
ఇంటి నిండా డబ్బుల కట్టలే.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం
ఇంటి నిండా డబ్బుల కట్టలే.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం
హైస్పీడ్‌ దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం!
హైస్పీడ్‌ దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం!
వీరు మట్టిని ముట్టినా బంగారమే.. ఈ రాశులు సెప్టెంబర్ మహారాజులు
వీరు మట్టిని ముట్టినా బంగారమే.. ఈ రాశులు సెప్టెంబర్ మహారాజులు
చెప్పిన మాట వినరు.. కష్టాల సుడిగుండంలో చుట్టుకునే రాశులివే
చెప్పిన మాట వినరు.. కష్టాల సుడిగుండంలో చుట్టుకునే రాశులివే
సాయంత్రం ఆకలికి ఈ హెల్తీ స్నాక్‌ ట్రై చేయండి.. 5 నిమిషాల్లో తయారీ
సాయంత్రం ఆకలికి ఈ హెల్తీ స్నాక్‌ ట్రై చేయండి.. 5 నిమిషాల్లో తయారీ