AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడదల రజిని ఘటనపై SEC సీరియస్.. ఎస్సై ప్రియాంకపై విచారణకు ఆదేశం

పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజిని ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆగ్రహం వ్యక్తం చేసింది. చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంకపై విచారణకు ఆదేశించడంతో పాటు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆమెను ఎన్నికల విధులతో సహా అన్ని విధుల నుంచి తప్పించాలని ఆదేశించింది.

విడదల రజిని ఘటనపై SEC సీరియస్.. ఎస్సై ప్రియాంకపై విచారణకు ఆదేశం
Chilakaluripet Incident
Ram Naramaneni
|

Updated on: Oct 24, 2026 | 6:31 PM

Share

పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినికి సంబంధించిన ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంకపై విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఆమెను ఎన్నికల విధులతో పాటు ఇతర అన్ని విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు సంబంధించిన మీడియా కథనాలు, వీడియోలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించాలని SEC స్పష్టం చేసింది. ఈ ఘటనలో బాధ్యులుగా తేలిన పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

శుక్రవారం నామినేషన్ల సందర్భంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. యడ్లపాడు జడ్పీటీసీ అభ్యర్థి బుల్లబ్బాయిని విడదల రజిని ఇంటి గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. తన అనుచరులను ఇంట్లోకి ఎందుకు అనుమతించడం లేదంటూ రజిని పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమె స్వయంగా బయటకు వచ్చే ప్రయత్నం చేయగా, చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంక ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో విడదల రజిని కిందపడిపోయారు.

వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, మీడియా కథనాలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, పోలీసుల వ్యవహారశైలి, సంబంధిత అధికారుల పాత్రపై విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల సమయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన నేపథ్యంలో ఈ ఘటనపై SEC తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Follow Us