RK Roja: ఇదే నా అడ్డా..! ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా.. ఇక్కడే ఉంటాః రోజా

| Edited By: Balaraju Goud

Aug 30, 2024 | 6:08 PM

అటా.. ఇటా.. రోజా ఎటు..? అసలు రోజా దారెటు..? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పొలిటికల్ ఇష్యూ. అయితే తానెక్కడికీ పోలేదంటూ సడన్‌గా రోజా సొంత నియోజకవర్గంలో ప్రత్యక్షమైంది. మూడు నెలలుగా నగరికి దూరంగా మౌనంగా ఉన్న రోజా ఇప్పుడు ఇక్కడే ఉంటా ఇచ్చిన మాట మేరకు అందుబాటులోనే ఉంటానంటోంది.

RK Roja: ఇదే నా అడ్డా..! ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా.. ఇక్కడే ఉంటాః రోజా
Rk Roja
Follow us on

అటా.. ఇటా.. రోజా ఎటు..? అసలు రోజా దారెటు..? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పొలిటికల్ ఇష్యూ. అయితే తానెక్కడికీ పోలేదంటూ సడన్‌గా రోజా సొంత నియోజకవర్గంలో ప్రత్యక్షమైంది. మూడు నెలలుగా నగరికి దూరంగా మౌనంగా ఉన్న రోజా ఇప్పుడు ఇక్కడే ఉంటా ఇచ్చిన మాట మేరకు అందుబాటులోనే ఉంటానంటోంది.

ఆర్కే రోజా. పరిచయం అక్కర్లేని పొలిటీషియన్. ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత నగరికి ఏపీ రాజకీయాలకు కాస్తా దూరంగానే ఉన్న మాజీ మంత్రి అర్కే రోజా పై ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. రోజా తమిళ రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తునే సాగుతోంది. చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్న రోజా ఆ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించబోతుందన్న సందేహం అందరూ వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో రోజా ఉండబోతుందన్న ప్రచారం కూడా సాగుతోంది. పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ తమిళరాజకీయాల్లో ఉంటుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి.

నగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అదృష్టం మంత్రిగా పనిచేశారు రోజా. ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని ఆశ పడి భంగపడ్డాక రోజా నగిరికి దూరంగానే ఉండిపోయారు. మూడు నెలలుగా ప్రముఖ ఆలయాలు చుట్టూ ప్రత్యేకించి తమిళనాడులోని గుడులు, గోపురాలు తిరుగుతున్నారు రోజా. ఎక్కువ సమయం చెన్నైలోనే ఉంటున్న రోజా నగరి వైసీపీ కేడర్‌కు కూడా అందుబాటులోకి రాకుండా పోయారు. ఎప్పుడూ వివాదాస్పద కామెంట్స్, సొంత పార్టీలోని అసమ్మతి నేతలతో ఫైట్ చేస్తూ వచ్చిన రోజా ఒక్కసారిగా సైలెంట్ గా ఉండిపోవడంతో రోజా నెక్స్ట్ స్టెప్ ఏంటన్న చర్చ జోరుగా నడించింది.

ఈ నేపథ్యంలోనే రోజా ఊహాగానాలకు మరింత ఛాన్స్ ఇచ్చింది. భర్త ఆర్కే సెల్వమణి‌కి తమిళ పొలిటికల్ పార్టీలతో ఉన్న సన్నిహిత సంబంధాలు, మరోవైపు తమిళనాడులో వస్తున్న కొత్త పార్టీలు రోజాను ఆకర్షించబోతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే మూడు నెలలుగా ఉన్న మౌనాన్ని వీడిన రోజా పుత్తూరులో ప్రత్యక్షం కావడం, ఆమె చేసిన కామెంట్స్ తమిళ రాజకీయాల పట్ల రోజా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. నిన్న మొన్నటి దాకా జరిగిన ప్రచారానికి తెర దింపింది. అనేక తమిళ సినిమాల్లో నటించిన రోజా అక్కడి వారికి అభిమాన నటిగానే ఉంటానే తప్ప రాజకీయంగా ఆదరించిన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్న అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేసింది. పుట్టింటి రాజకీయాలకే రోజా పరిమితం అవుతానని చెప్పే ప్రయత్నం చేసిన రోజా పుత్తూరులో బలిజ భవన్ లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు.

వీడియో చూడండి..

ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ కనిపిస్తున్నా, ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యేకించి నగరిలో ఆమెకు అంత అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా నగిరి లోనే ఉంటానంటోంది. ఒకవైపు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో రోజా మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడే ఉంటా ఎక్కడికీ వెళ్ళనని చెబుతోంది. నగరి ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని చెబుతున్న రోజా గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందేటంతటి తప్పులు చేయలేదని చెబుతోంది రోజా. దీంతో రోజా వైసీపీకి గుడ్ బై చెప్పబోతోందని, తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో వైసీపీ కనబడకుండా చేసిందని జరుగుతున్న ప్రచారానికి రోజా కొత్త స్టైల్ లో పుల్ స్టాఫ్ పెట్టింది. గతంలో మాదిరిగా కాకుండా కొత్త హెయిర్ స్టైల్ లో పుత్తూరులో ప్రత్యక్షమై స్పష్టం చేసింది. కొత్త స్టైల్ లో కనిపించి ఇక్కడే ఉంటానని చెప్పింది. అందుబాటులో ఉంటానని మాట ఇస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..