Smuggling: చిత్తూరు నల్లమల అడవుల్లో ఎర్రచందనం డంప్ కలకలం.. టాస్క్ ఫోర్స్ అధికారులను చూసి 50 మంది స్మగ్లర్లు పరార్..

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పరిధిలోని నల్లమల అడవీ ప్రాంతంలో మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ కలకలం రేగింది. చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురం సమీపంలో..

Smuggling: చిత్తూరు నల్లమల అడవుల్లో ఎర్రచందనం డంప్ కలకలం.. టాస్క్ ఫోర్స్ అధికారులను చూసి 50 మంది స్మగ్లర్లు పరార్..
Follow us

|

Updated on: Dec 11, 2020 | 5:58 PM

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పరిధిలోని నల్లమల అడవీ ప్రాంతంలో మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ కలకలం రేగింది. చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురం సమీపంలో ఎర్రచందనం దుంగలకు సంబంధించిన భారీ డంప్‌ను టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. 49 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే టాస్క్ ఫోర్స్ అధికారుల రాకను పసిగట్టిన సుమారు 50 మంది స్మగర్లు అక్కడి నుంచి పరార్ అయ్యారు. విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని ఎర్రచందనం దుంగల డంప్‌ను పరిశీలించారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎస్పీ ఆంజనేయులు.. లాక్‌డౌన్ తరువాత స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని అన్నారు. స్మగ్లర్లకు స్థానికులు కూడా సహకరిస్తున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. స్మగ్లర్లకు షెల్టర్ ఇస్తున్న వారిపై నిఘా పెట్టామని ఎస్పీ తెలిపారు. స్మగ్లర్లకు షెల్టర్ ఇవ్వొద్దని వార్నింగ్ ఇచ్చిన ఎస్పీ.. ఒకవేళ ఎవరైనా షెల్టర్ ఇచ్చినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.

Latest Articles
మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..
మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌