AP Rain Alert: భారీ వర్షాలు.. వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలోని 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్..

|

Nov 11, 2021 | 8:41 AM

AP Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో

AP Rain Alert: భారీ వర్షాలు.. వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలోని 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్..
Rain Alert
Follow us on

AP Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం శుక్రవారం నాటికి బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణించే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తుపాన్ ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమలో అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో భారీవర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాలు వరదలతో అస్తవ్యస్తంగా మారాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చెన్నై సహా ఉత్తర జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. చెన్నైలో గురువారం అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉత్తర చెన్నై, తమిళనాడు డెల్టా ప్రాంతాల్లోని 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

Also Read:

Petrol Diesel Price: మెట్రో నగరాల్లో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం నెమ్మదిగా..

Hyper Aadi: తనపై దాడి చేశారనే వార్తలపై స్పందించిన హైపర్ ఆది.. వారికి స్వయంగా డబ్బులిస్తానంటూ..