Pothina Mahesh: జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్.. పవన్‌పై సంచలన వ్యాఖ్యలు

|

Apr 09, 2024 | 8:22 PM

జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్.. పవన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో మరో నాయకుడిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతకీ ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు. పోతినపై జనసేన నేతల రియాక్ట్ అవుతున్నారు ? విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించిన దగ్గర నుంచి తీవ్ర అసంతృప్తిగా ఉన్న పోతిన.. పలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా

Pothina Mahesh: జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్.. పవన్‌పై సంచలన వ్యాఖ్యలు
Pothina Mahesh
Follow us on

జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్.. పవన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో మరో నాయకుడిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతకీ ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు. పోతినపై జనసేన నేతల రియాక్ట్ అవుతున్నారు ? విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించిన దగ్గర నుంచి తీవ్ర అసంతృప్తిగా ఉన్న పోతిన.. పలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం దక్కకపోవడంతో జనసేనకు గుడ్ బై చెప్పారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారా అని బెజవాడలో జోరుగా చర్చ జరిగింది. అయితే 24 గంటల్లోనే ఈ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు పోతిన మహేష్. వైసీపీలో చేరబోతున్నట్టు పోతిన చెప్పకనే చెప్పేశారు. సింహంలా సింగిల్‌గా వచ్చే దమ్మున్న నాయకుడితోనే తన పయనం ఉంటుందన్నారు పోతిన. జెండాకూలీలా బతకడం తన వల్ల కాదని.. వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడితో కలిసి పనిచేస్తానంటున్నారు పోతిన మహేష్.

పవన్‌కల్యాణ్‌పై పోతిన మహేష్ ఆరోపణలు చేయడం పట్ల జనసేన నేతలు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. అన్యాయం జరిగిందనిపిస్తే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు.. అలా అని లేని పోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని కృష్ణా జిల్లా జనసేన నేతలు తప్పుబట్టారు. ఎంత పడితే అంత మాట్లాడితే జనసేన కార్యకర్తలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

పవన్‌పై పోతిన మహేష్ పలు ఆరోపణలు కూడా చేశారు. వాటికి ఆధారాలు కూడా ఉన్నాయనీ.. త్వరలోనే బయటపెడతాననీ అన్నారాయన. అయితే పోతినకు అదే రేంజ్‌లో జనసేన నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాము కూడా పోతిన చరిత్రను బయటపెడతామంటూ హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి