AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిరోడ్డులో సీఐ వీరంగం.. షాప్‌ మూసివేసి ఇంటికి వెళ్తోన్న మహిళతో ఇదే పని..!

కృష్ణా జిల్లాలో ఓ పోలీస్‌ అధికారి మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు. గన్నవరంలో ఓ మహిళ పట్ల CRPF సీఐ కిరణ్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. రోడ్డు పక్కన కారు ఆపిన కిరణ్ తోపాటు ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో రాత్రి షాప్‌ మూసివేసి మహిళ ఇంటికి వెళ్తోంది. మహిళను చూసి వికృతంగా హారన్‌, లైట్లు కొడుతూ వేధించారు.

నడిరోడ్డులో సీఐ వీరంగం.. షాప్‌ మూసివేసి ఇంటికి వెళ్తోన్న మహిళతో ఇదే పని..!
Police Officer Misbehaved
Balaraju Goud
|

Updated on: Sep 03, 2025 | 7:28 AM

Share

కృష్ణా జిల్లాలో ఓ పోలీస్‌ అధికారి మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు. గన్నవరంలో ఓ మహిళ పట్ల CRPF సీఐ కిరణ్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. రోడ్డు పక్కన కారు ఆపిన కిరణ్ తోపాటు ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో రాత్రి షాప్‌ మూసివేసి మహిళ ఇంటికి వెళ్తోంది. మహిళను చూసి వికృతంగా హారన్‌, లైట్లు కొడుతూ వేధించారు. దీంతో మహిళ భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. ఆమె భర్త వచ్చి కిరణ్‌ను ప్రశ్నిస్తే దాడికి దిగారు. బూతులు తిడుతూ ముగ్గురు కలిసి మహిళ భర్తను చితకబాదారు. దీంతో బంధువులకు సమాచారం ఇచ్చారు ఆ దంపతులు.

ఘటనా స్థలానికి వచ్చిన బంధువులు.. ముగ్గురు యువకులను నిలదీస్తే మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ మరింత రెచ్చిపోయారు. తాను పోలీస్‌నంటూ ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ అందరినీ ఇష్టానుసారం దూషించాడు కిరణ్‌. దీంతో బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీస్‌స్టేషన్‌లో సీఐ కిరణ్‌ ఇష్టానుసారం ప్రవర్తించాడు. అక్కడున్న పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దర్జాగా వెళ్లి ఫోన్‌కి చార్జింగ్‌ పెట్టుకుంటూ సొంత ఇంట్లో ఉన్నట్టు బిహేవ్‌ చేశాడు. అయితే మహిళపై దాడికి పాల్పడిన సీఐ కిరణ్ భద్రాచలంలో CRPF సీఐగా పనిచేస్తున్నాడని చెబుతున్నారు పోలీసులు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత