PM Modi: నారా రోహిత్‌‌కు ప్రధాని మోడీ లేఖ.. ఆ లోటు ఎవరూ తీర్చలేనిదంటూ ఎమోషనల్..!

|

Nov 19, 2024 | 1:04 PM

టాలీవుడ్ నటుడు నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు ఇటీవల అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలు జరిగాయి. రోహిత్ కుటుంబ సభ్యులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

PM Modi: నారా రోహిత్‌‌కు ప్రధాని మోడీ లేఖ.. ఆ లోటు ఎవరూ తీర్చలేనిదంటూ ఎమోషనల్..!
Pm Modi Pens Letter To Nara Rohit Expressing His Condolences
Follow us on

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్‌మోహన్‌ నాయుడు ఆరోగ్య సమస్యలతో కొద్దిరోజుల క్రితం కన్నుమూశారు. ఆదివారం ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలు జరిగాయి. రామ్ మూర్తి నాయుడు 1994-1999 వరకు చంద్రగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా పనిచేశారు. కాగా, రామ్‌మూర్తి నాయుడు కుమారుడు, ప్రముఖ నటుడు నారా రోహిత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలియజేస్తూ లేఖ రాశారు.

ఇది ఎప్పటికీ పూడ్చలేని శూన్యాన్ని మిగిల్చే నష్టమని మోదీ పేర్కొన్నారు. “ఒక ప్రజాప్రతినిధిగా రామ్‌మూర్తి నాయుడు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆకాంక్షలు మరియు సవాళ్లను వినిపించారు.  ఆంధ్రప్రదేశ్ ప్రజలు రామ్‌మూర్తి నాయుడిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. ఆయన ప్రభావం ప్రతీ ఒక్కరిపై ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు. “శ్రీ ఎన్. రామ్మూర్తి నాయుడు గారు అందించిన విలువలు కుటుంబానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అతనితో గడిపిన సమయాల జ్ఞాపకాలు ఈ కష్టమైన సమయంలో మీకు ఓదార్పుని మరియు సౌకర్యాన్ని అందిస్తాయి.  అతను ఎల్లప్పుడూ అందరీ హృదయాలలోనే ఉంటాడు, ”అని లేఖలో ప్రగాడ సంతాపం, సానుభూతి తెలిపారు. రామ్ మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు, ఈ ఘోరమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబానికి అందించాలని ఆయన ఆకాంక్షించారు.

నరేంద్ర మోడీ రాసిన లేఖకు నారా రోహిత్ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. “నా తండ్రి మృతికి సంతాపాన్ని లేఖ ద్వారా తెలిపినందుకు ధన్యవాదాలు. ఈ కష్ట సమయంలో మీ హృదయపూర్వక మాటలు నాకు మరియు నా కుటుంబానికి అపారమైన శక్తిని ఓదార్పునిచ్చాయి. మీ నుండి అటువంటి మద్దతు పొందడం నిజంగా ఓదార్పునిస్తుంది. మీ లేఖ మాలో విశ్వాసాన్ని కలిగించింది. మీ ఆలోచనాత్మకమైన సంజ్ఞకు నేను చాలా కృతజ్ఞుడను ” అని నారా రోహిత్ మోదీ ట్విట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి