Anantapur: సాయంత్రం రానున్న ఫోరెన్సిక్ రిపోర్ట్.. తేలనున్న గోరంట్ల మాధవ్ భవితవ్యం

|

Aug 10, 2022 | 3:32 PM

గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం ఏపీ పాలిటిక్స్‌ను ఓ కుదుపు కుదిపేస్తుంది. తాజాగా ఈ కేసులో కీ అప్‌డేట్ వచ్చింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ బుధవారం బయటకు రానుంది.

Anantapur: సాయంత్రం రానున్న ఫోరెన్సిక్ రిపోర్ట్.. తేలనున్న గోరంట్ల మాధవ్ భవితవ్యం
Gorantla Madhav
Follow us on

Hindupur MP Gorantla Madhav: అనంతపురం గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేటి(బుధవారం) సాయంత్రం న్యూడ్ వీడియోల ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను బయట పెట్టనున్నారు అనంతపురం ఎస్పీ.  ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఏముందనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రజంట్ ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ చుట్టే ఏపీ పాలిటిక్స్(AP Politics) తిరుగుతున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ బహిర్గతం చేయాలని టీడీపీ మొదట్నుంచి డిమాండ్ చేస్తుంది. అంతేకాదు పక్క రాష్ట్రంలోని ల్యాబ్‌లోనే దాన్ని టెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వస్తుంది. కాగా అది ఒరిజినల్ అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వైసీ(YSRCP)పీ హైకమాండ్ ప్రకటించింది. కీలక నేత సజ్జలతో పాటు పలువురు ఎంపీలు, మంత్రులు సైతం ఇదే మాట చెబుతూ వస్తున్నారు. గతంలో ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా ఉన్న సినీ నటుడు ఫృథ్వీ అసభ్యకర ఆడియో బయటకు వస్తేనే అతనిపై వేటు వేశారు. ప్రజంట్ రాయలేని, చూపించలేని రీతిలో ఉన్న గోరంట్ల మాధవ్ వీడియో నిజమని తేలితే వైసీపీ ఏం చర్య తీసుకోబోతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది.

అది మార్ఫింగ్ వీడియో అంటున్న గోరంట్ల

అది మార్ఫింగ్ వీడియో అని.. కొందరు టీడీపీ నేతలు కుట్ర పన్ని ఈ ఫేక్ వీడియో విడుదల చేశారని గోరంట్ల వాదిస్తున్నారు. వీడియో లీకైన రోజే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అది ఫేక్ వీడియో అని కొట్టిపారేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశానని.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని తెలిపారు. తన జిమ్ వీడియోలను మార్పింగ్ చేసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయాలి..