AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandus World:యూట్యూబర్ నందన కేసులో బిగ్‌ అప్‌డేట్.. పోలీసుల విచారణలో కీలక విషయాలు

నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకురాలు, రమానందన కేసులో బిగ్‌ అప్‌డేట్ వచ్చింది. పోలీసుల నోటీసుల నేపథ్యంలో మంగళవారం విచారణకు హాజరయ్యారు రమానందన. ఈ కేసు విషయంపై దాదాపు 4 గంటల పాటు ఆమెను ప్రశ్నించిన పోలీసులు.. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరవ్వాలని ఆమెకు నోటీసులు ఇచ్చారు.

Nandus World:యూట్యూబర్ నందన కేసులో బిగ్‌ అప్‌డేట్.. పోలీసుల విచారణలో కీలక విషయాలు
Youtuber Ramanandana Fraud Case Update
Anand T
|

Updated on: Sep 11, 2026 | 7:32 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రముఖ యూట్యూబర్ నందన కేసులో బిగ్‌ అప్‌డేట్ వచ్చింది. ఉద్యోగాలు, వీసాల రెన్యూవల్ పేరుతో మోసాలకు పాల్పడ్డారనే కేసులో తాజాగా పోలీసుల విచారణకు హాజరయ్యారు రమానందన. ఆమెను దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు.. ఈ కేసులో కీలకంగా ఉన్న డెస్టినీ కన్సల్టెన్సీ ఎవరిది, దాని ఓనర్ ఎవరు అనే కీలక ప్రశ్నలు అడిగారు. అయితే ఈ విచారణలో ఆమె కొన్ని కీలక విషయాలు చెప్పింది. డెస్టినీ కన్సల్టెన్సీ గురించి తనకు ఏమీ తెలియదని.. దాన్ని తన భర్త మధుకర్ మెయింటైన్ చేస్తున్నట్లు తెలిపింది. ఆ కన్సల్టెన్సీ వ్యవహారాల్లో తన జోక్యం ఏమాత్రం లేదని నందన తెలిపింది.

తన నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతికుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో నందనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఆమె లండన్ నుంచి హైదరాబాద్ రాగా.. అక్కడ లుక్‌ఔట్ నోటీసుల ఆధారంగా ఆమెను గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు.. అదుపులోకి తీసుకొని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించగా.. విచారణకు రావాలని ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో నందన, తన తల్లి, లాయర్‌తో పాటు వచ్చి విచారణకు హాజరయ్యారు. ఆమెను ప్రశ్నించిన పోలీసులు.. ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు.

అయితే నందన పోలీస్ స్టేషన్‌కు వచ్చిన విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కొందరు బాధితులు అక్కడికి చేరుకున్నారు. తాము కూడా ఈ కేసులో డబ్బులు పోగొట్టుకున్నామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొనగా పోలీసుల చొరవతో వివాదం సద్దుమణిగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
:యూట్యూబర్ నందన కేసులో బిగ్‌ అప్‌డేట్.. పోలీసుల విచారణలో..
:యూట్యూబర్ నందన కేసులో బిగ్‌ అప్‌డేట్.. పోలీసుల విచారణలో..
రూ.6 లక్షల ప్రారంభ ధరతో మారుతి బాలెనో..
రూ.6 లక్షల ప్రారంభ ధరతో మారుతి బాలెనో..
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్
'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'
'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'
రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం
రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం
భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే
భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?