AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దండిగా డబ్బు సంపాదించాలనుకున్న ధనలక్ష్మీ.. యూట్యూబ్ చూసి కొడుకుతో స్కెచ్.. కట్ చేస్తే..

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ పద్ధతులు చూసి దొంగతనాలకు పాల్పడిన తల్లీకొడుకులను విశాఖపట్నం పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూటీ నంబర్ ప్లేట్‌ను దాచిపెట్టి, మాస్క్‌లతో వృద్ధురాలి మెడలోని 5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన వారిని సీసీటీవీ ఆధారాలతో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

దండిగా డబ్బు సంపాదించాలనుకున్న ధనలక్ష్మీ.. యూట్యూబ్ చూసి కొడుకుతో స్కెచ్.. కట్ చేస్తే..
Visakhapatnam Chain Snatching
Shaik Madar Saheb
|

Updated on: Jul 07, 2026 | 12:48 PM

Share

భార్య విలాసవంతమైన జీవితం, చిట్టీలు వేస్తే నష్టం.. ఫ్లాట్ వాయిదాలు చెల్లించలేక తంటాలు.. పైగా అప్పులోళ్ల ఒత్తిడి.. ఇవన్నీ తాళలేక భర్త భార్యను వదిలిపెట్టాడు.. దీంతో భార్య పెద్ద స్కెచ్చే వేసింది.. ఆర్ధిక కష్టాల నుంచి గట్టెంకకెందుకు మాస్టర్ ప్లాన్ రచించింది.. యూట్యూబ్ చూసి చైన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకుంది.. కన్న కొడుకును దొంగతనానికి ఉసిగోల్పింది.. ఆ తర్వాత.. దొరకకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మొత్తం తీసుకుంది.. కానీ.. పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి యూట్యూబ్ చూసి చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన తల్లీకొడుకులను విశాఖపట్నం పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

విశాఖపట్నం నగరానికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, చిట్టీలు వేసి భారీగా నష్టపోయింది. కొనుగోలు చేసిన ఫ్లాట్ EMI చెల్లించలేక, అప్పులవాళ్ల ఒత్తిడి ఎక్కువ కావడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. చుట్టుముట్టిన ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ధనలక్ష్మి అడ్డదారి వెతికింది. ఈజీ మనీ కోసం ఆమె యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో చూసి పక్కాగా స్కెచ్ వేసింది. ఈ పాపంలో తన కన్నకొడుకు అక్షిత్‌ను కూడా భాగస్వామిని చేసింది. పోలీసులు దొరకకుండా ఉండేందుకు ఈ తల్లీకొడుకులు పక్కా జాగ్రత్తలు తీసుకున్నారు. స్కూటీ నెంబర్ ప్లేట్ కనిపించకుండా ప్లాస్టర్ వేశారు. కొడుకు అక్షిత్ టోపీ, మాస్క్ ధరించి బైక్ నడపగా, తల్లి ధనలక్ష్మి చున్నీతో ముఖం కనిపించకుండా కప్పేసుకుంది.

జూన్ 27న సుజాతనగర్‌లో ఒంటరిగా వెళ్తున్న ఓ వృద్ధురాలిని వీరు టార్గెట్ చేశారు. అడ్రస్ అడుగుతున్నట్లు మాటలు కలిపి, ఒక్కసారిగా ఆమె మెడలోని 5 తులాల బంగారు గొలుసును తెంచుకుని స్కూటీపై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టి నిందితుల ఆనవాళ్లను గుర్తించారు. తల్లీకొడుకులను అరెస్ట్ చేసి, వారి నుంచి దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చైన్ స్నాచింగ్ కు పాల్పడిన తల్లి, కొడుకు అరెస్ట్..
చైన్ స్నాచింగ్ కు పాల్పడిన తల్లి, కొడుకు అరెస్ట్..
శనీశ్వరుడితో చంద్రుడు యుతి.. ఇక వారికి తిరుగులేని విజయం..!
శనీశ్వరుడితో చంద్రుడు యుతి.. ఇక వారికి తిరుగులేని విజయం..!
టేకు చెట్టు కేవలం ఫర్నిచర్‌కే కాదు..ఔషధ గుణాలు తెలిస్తే షాకవుతారు
టేకు చెట్టు కేవలం ఫర్నిచర్‌కే కాదు..ఔషధ గుణాలు తెలిస్తే షాకవుతారు
మహిళలకు రక్షాబంధన్ గిఫ్ట్.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.2500..
మహిళలకు రక్షాబంధన్ గిఫ్ట్.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.2500..
ఆ సినిమాతో మంచి గుర్తింపు వస్తుందనుకున్నా.. కానీ
ఆ సినిమాతో మంచి గుర్తింపు వస్తుందనుకున్నా.. కానీ
శుక్రుడితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..కాస్త జాగ్రత్త..!
శుక్రుడితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..కాస్త జాగ్రత్త..!
మీ స్మార్ట్‌ఫోన్ మీ బాడీ షేప్‌ను మార్చేస్తోందా? ఫోన్ బాడీ అంటే ?
మీ స్మార్ట్‌ఫోన్ మీ బాడీ షేప్‌ను మార్చేస్తోందా? ఫోన్ బాడీ అంటే ?
ఇంట్లో కోతులు,బయట కుక్కలు! అధికారుల చర్యల కోసం ఎదురుచూస్తున్న జనం
ఇంట్లో కోతులు,బయట కుక్కలు! అధికారుల చర్యల కోసం ఎదురుచూస్తున్న జనం
ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్
ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు..!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు..!