Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంచి మనసు.. కోవిడ్ ఆస్పత్రికి రూ. 30 లక్షలతో.

| Edited By: Subhash Goud

May 12, 2021 | 11:22 PM

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మాములుగా లేదు. ప్ర‌మాద‌క‌ర రీతిలో పాజిటివ్ కేసులు మ‌ర‌ణాలు ఉన్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు దొర‌క్క‌, ఆక్సిజ‌న్ కొర‌త‌తో రోగులు అల్లాడుత‌న్నారు.

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంచి మనసు.. కోవిడ్ ఆస్పత్రికి రూ. 30 లక్షలతో.
vallabhaneni-vamshi
Follow us on

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మాములుగా లేదు. ప్ర‌మాద‌క‌ర రీతిలో పాజిటివ్ కేసులు మ‌ర‌ణాలు ఉన్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు దొర‌క్క‌, ఆక్సిజ‌న్ కొర‌త‌తో రోగులు అల్లాడుత‌న్నారు. ఏపీలో కూడా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు కొత్త‌ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నారు. ముఖ్యంగా కరోనా రోగులుకు ఆక్సిజ‌న్ కొర‌త అధికంగా ఉంది. ఇటీవలే తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ స‌రిగ్గా అంద‌క‌పోవ‌డంతో అధికారికంగా 11 మంది చ‌నిపోయారు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంచి మనసు చాటుకున్నారు. ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు వంశీ తన వంతుగా సాయం చేశారు. కృష్ణా జిల్లా చిన్నఅవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ కోవిడ్ హాస్పిట‌ల్ కు రూ. 30 లక్షల విలువైన 70 ఆక్సిజన్‌ సిలిండర్లు అంద‌జేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కార్యాలయ స్టాఫ్ ఆస్పత్రి యాజమాన్యానికి ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. కాగా వంశీని ఆద‌ర్శంగా తీసుకుని ప‌లువ‌రు ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌ముఖులు ముందుకు రావాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది.

Also Read: తెలంగాణ గాంధీ ఆస్పత్రిలో అద్భుతం.. కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు..

బంధుత్వాన్ని ఉపయోగించి బాబు వ్యాక్సిన్లు రప్పిస్తే మాకు సమ్మతమే : ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని