Watch Video: బొప్పాయి లోడుతో లారీ.. అందులో 35 మంది కూలీలు.. ఏమైందంటే..

| Edited By: Srikar T

Jun 18, 2024 | 9:39 PM

విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలానే రైల్వేకోడూరులో విద్యుత్ షాక్ తగిలి బొప్పాయి లోడుతో వెళ్తున్న లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఒక మహిళా కూలి మృతి చెందగా చాలా మందికి గాయాలయ్యాయి. బొప్పాయి లోడుతో వస్తున్న లారీ పూర్తిగా కాలి బూడిదైంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండల పరిసర ప్రాంతాల్లో బొప్పాయి పంటను అధికంగా పండిస్తారు. ఆ పంటను లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

Watch Video: బొప్పాయి లోడుతో లారీ.. అందులో 35 మంది కూలీలు.. ఏమైందంటే..
Lorry Fire Accident
Follow us on

విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలానే రైల్వేకోడూరులో విద్యుత్ షాక్ తగిలి బొప్పాయి లోడుతో వెళ్తున్న లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఒక మహిళా కూలి మృతి చెందగా చాలా మందికి గాయాలయ్యాయి. బొప్పాయి లోడుతో వస్తున్న లారీ పూర్తిగా కాలి బూడిదైంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండల పరిసర ప్రాంతాల్లో బొప్పాయి పంటను అధికంగా పండిస్తారు. ఆ పంటను లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అయితే నిన్న ఒక లారీ బొప్పాయికాయలు లోడ్ చేసుకుని వెళుతున్న సమయంలో విద్యుత్ తీగలు లారీకి తగిలాయి. దీంతో కరెంట్ షార్ట్ సర్యూట్ అయి లారీ తగలబడింది. లారీలో బొప్పాయి లోడ్ చేయాలంటే దాదాపు 30 నుంచి 35 మంది కూలీలు పని చేయాల్సి ఉంటుంది.

రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట వద్ద లారీలో బొప్పాయి లోడు వెళుతుండగా 11 కెవి విద్యుత్ తీగలు తగిలి లారీ దగ్ధమైంది. దీంతో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. షాక్ తగిలిన వెంటనే లారీలో ఉన్న 35 మంది కూలీలు కిందికి దూకి వేయడంతో పెను ప్రమాదం తప్పింది లారీ ఎత్తు ఎక్కువగా ఉండటం అందులోను లారీ క్యాబిన్, ఛాయిస్ భాగం పూర్తిగా చెక్కతో ఉండటంతో మంటలు త్వరగా అంటుకున్నాయి. మృతిచెందిన మహిళకు నలుగురు పిల్లలు భర్త ఉన్నారు. భార్య మంజుల చనిపోవడంతో భర్త కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏది ఏమైనా విద్యుత్ షాక్‎కు గురైన వెంటనే అందులోని కూలీలంతా ఒక్కసారిగా దూకివేయడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. లేదంటే దాదాపు 35 మంది సజీవదహనం అయ్యేవారని చెప్పుకుంటున్నారు స్థానికులు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..