AP Rains: ఏపీకి వాయుగుండం ముప్పు.. ఇక ఫుల్‌గా వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు

|

Jul 19, 2024 | 6:51 PM

ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆ వివరాలు ఇలా..

AP Rains: ఏపీకి వాయుగుండం ముప్పు.. ఇక ఫుల్‌గా వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు
Ap Rain Alert
Follow us on

ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది శనివారం తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత క్రమంగా వాయుగుండం బలహీనపడనుందన్నారు. దీని ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇది చదవండి: చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నాడు.. తీరా మూత ఓపెన్ చేయగా

అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదివారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం ఏలూరు జిల్లా 2 ఎస్డీఆర్ఎఫ్, కోనసీమ1 ఎస్డీఆర్ఎఫ్, తూర్పుగోదావరి 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అంబానీ సంపద కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెల్సా..? లెక్కలు చూస్తే షాకే

ఎగువ నుంచి వస్తున్న వరద, రాష్ట్రంలోని భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

ఇది చదవండి: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..