నోరు జారానంటూ JC ప్రభాకర్‌రెడ్డి సారీ చెప్పారు.. మాధవీలతను ఆ మాట అన్నందుకు మాత్రమే సారీ అంటూ.. BJP వాళ్లపై మరోసారి చెలరేగిపోయారు.. అలాగే నోట్ల కట్టలు తన ఎదురుగా ఉన్న టీ పాయ్‌పై విసురుతూ ఇంకొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. తాను పిలుపిస్తే చాలు కట్టలకు కట్టలు నోట్లు వచ్చి పడతాయంటున్నారు JC. ఆ డబ్బంతా తాడిపత్రి అభివృద్ధికే వాడతానంటున్నారు. న్యూఇయర్ సందర్భంగా చందాలు అడిగితే ఇదిగో ఇలా కట్టలకు కట్టలు వచ్చాయంటున్నారు. తాడిపత్రి అంటే JC…… JC అంటే తాడిపత్రి అంటున్నారు.. తాను ఒక్క పిలుపిస్తే కోట్లకు కోట్లు వచ్చిపడతాయని.. అదీ తన పవరని చెప్పుకొచ్చారు. తాను మరీ అంత నీచుడిని కాదని.. ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేశారు.. థర్టీఫస్ట్ రాత్రి JC పార్క్‌లో ఏర్పాటు చేసిన వేడుకలపై BJP మహిళా నేతలు మాధవీలత, సాదినేని యామిని విమర్శలు చేసిన నేపథ్యంలో తాను నోరు జారినందుకు సారీ చెప్పారు. ఆవేశంలో నోరు జారా.. అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. బూతు పదం వాడినందుకు క్షమాపణ కోరుతున్నా అని అన్నారు జేసీ. మాధవీలతకు సారీ చెప్తూనే.. తనపై విమర్శలు చేస్తున్న వాళ్లను టార్గెట్ చేశారు.
నోట్ల కట్టలు టేబుల్‌పై విసురుతూ.. తాను పిలుపిస్తే ప్రజల నుంచి వచ్చే స్పందన ఇది అంటూ చెప్పుకొచ్చారు. జేసీ పార్క్‌కు చందాల వసూళ్లపైనా ప్రభాకర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.. తాను ఎవరినీ బలవంతంగా డబ్బులు అడగలేదన్నారు. తాడిపత్రి ప్రజలకు తనపై ప్రేమ ఉంది కాబట్టే.. కట్టలు కట్టలు డబ్బులు చందాలుగా ఇస్తున్నారన్నారు. ఇక తనపై విమర్శలు చేసేవాళ్లంతా ఫ్లెక్సీగాళ్లే అంటూ మండిపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అదృష్టం కలిసివచ్చి కొందరు నాయకులు అయ్యారని విమర్శించారు. తనపై మాట్లాడే వాళ్లు ప్రజలకు మేలు చేస్తే బాగుంటుందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..