మన జానపద కథల్లో చంద్రుడికి ప్రత్యేక స్థానముంది. చందమామ అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటాం. అలాంటి మనందరి మూన్ మిషన్‌కు చంద్రయాన్-3ని చేరువ చేసేందుకు బాహుబలి రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. ఫెయిల్యూర్ ఆధారిత విధానంతో అభివృద్ధి చేసిన టెక్నాలజీతో చంద్రయాన్ 3 ప్రయోగం మరికొన్ని గంటల్లో జరగబోతోంది. భారత్ ఒక్కటే కాదు చంద్రయాన్ 3 ప్రయోగం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇస్రో సక్సెస్ రేటుకు తోడు భారతీయ శాస్త్రవేత్తల పరిజ్ఞానం.. అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే భారత్‌ను తిరుగులేని శక్తిగా మార్చింది. చంద్రయాన్ సిరీస్‌లో ఇదో మూడో ప్రయోగం.
చందమామను అందుకునే తరుణం దగ్గర పడడంతో.. అందరిలో ఉత్కంఠ. మూన్‌లైట్ ముంగిట్లో వాలే చంద్రయాన్ 3 ప్రయోగంపై యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న తరుణం. ఈ ప్రయోగం ఎలా సాగనుంది.. ఎలాంటి ప్రయోజనాలు ఉండనున్నాయన్న దానిపై స్పెషల్ డిస్కషన్‌లో చర్చిద్దాం.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో.. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
Chandrayaan-3 scripts a new chapter in India’s space odyssey. It soars high, elevating the dreams and ambitions of every Indian. This momentous achievement is a testament to our scientists’ relentless dedication. I salute their spirit and ingenuity! https://t.co/gko6fnOUaK
— Narendra Modi (@narendramodi) July 14, 2023
బాహుబలి రాకెట్ చంద్రయాన్-3 సక్సెస్ అయినట్లు ఇస్రో ప్రకటించింది. రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయిన శాటిలైట్.. భూకక్షలో 24 రోజుల పాటు తిరగనుంది. అనంతరం ఆగస్ట్ 23న చంద్రునిపై ల్యాండ్ కానుంది.
చంద్రయాన్-3 విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో ఇస్రోలో సంబరాలు అంబరాన్ని అంటాయి.
మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 తొలిదశ విజయవంతమైంది.
ఈసారి ఆర్బిటర్ లేకుండా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు సాఫ్ట్ లాండింగ్ అయ్యేలా చూస్తారు. తర్వాత తమ జర్నీని ప్రారంభిస్తాయి. ల్యాండర్, రోవర్ రెండూ అనువైన ప్రాంతం కోసం వెతుకులాట మొదలు పెడతాయి. ఫైనల్ అప్రోచ్‌కు వచ్చాక లూనర్ సర్ఫేస్ మీదకు ల్యాండ్ అవుతాయి. ర్యాంప్ కిందకు దిగే సమయంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కనిపిస్తుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు లూనర్ సర్ఫేస్ మీదకు దిగుతాయి. ఇవి 14 రోజుల పనిదినాలు చంద్రుడిపై ప్రయోగాలకు అనువుగా పనిచేస్తాయి. ఈ ప్రయోగంతో భారత్ చంద్రుడి మీద తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదిస్తుంది.
మూన్ చుట్టూ సుమారు 3,84,000 కి.మీ. ప్రయాణిస్తుంది. వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుకున్నాక స్లోగా మారి క్యాప్చర్ చేయడం మొదలు పెడుతుంది. చంద్రుడి ఆర్బిట్‌లో ఇవి చాలా రోజులుంటాయి. ఇస్రో నుంచి కమాండ్ వచ్చాక.. విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్‌లు భూగురుత్వాకర్షణ నుంచి విడిపోయి చంద్రుడి వైపు ప్రయణిస్తాయి. దీన్ని లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్ అంటారు.
బాహుబలి లాంటి ఈ రాకెట్ దాదాపు 130 ఆసియా ఏనుగుల బరువుతో సమానం. ఒక్కొక్కటిగా శాటిలైట్‌లను పైకి తీసుకెళ్తూ వదిలిపెడుతూ ఉంటుంది. చంద్రుడి కక్ష్యలోకి చేరుకున్నాక 3921 కిలోల బరువున్న చంద్రయాన్ 3ని కక్ష్యలోకి విడిచిపెడుతుంది. ఇది చంద్రుడి పుట్టుక మీద అనేక రహస్యాలను బయటపెట్టగలదు.
ప్రతిష్టాత్మకమైన ఇండియన్ మూన్‌మిషన్. లాంచ్‌ప్యాడ్ నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది. భారతదేశానికి చెందిన పవర్‌ఫుల్ రాకెట్ దీన్ని తీసుకెళ్లబోతోంది. కౌంట్‌డౌన్ సాగుతుండడంతో… 642 టన్నుల బరువు, 43.5 మీటర్ల పొడవు ఉన్న భారీ లాంచ్ వెహికల్ మార్క్ 3 చంద్రయాన్ 3ని ఆర్బిటర్‌లోకి మోసుకెళ్లనుంది.
చంద్రయాన్ 3కి కూకట్‌పల్లిలో తయారు చేసిన పరికరాలను అమర్చడంతో ఈ ప్రాంతం మరోసారి చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటి వరకు 50సార్లు నాగసాయి ప్రెసిషన్ ఇంజనీర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఉపగ్రహాల తయారీలో కీలక పాత్ర పోషించింది.
నేడు చంద్రయాన్-3 ప్రయోగం.. మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం. భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో జూలై 14 సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఈ రోజు నుంచి మన మూడో చంద్ర మిషన్ చంద్రయాన్-3 తన చారిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించనుంది. చంద్రుని పట్ల దేశప్రజల కలలు, ఆశలు, ఆకాంక్షలు దాగి ఉన్నాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.