AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duvvada Family: నేటితో దువ్వాడ ఫ్యామిలీ రచ్చకు ఫుల్ స్టాప్‌ పడుతోందా? వాణి పెట్టిన షరతులేంటి..?

నేటితో దువ్వాడ ఫ్యామిలీ రచ్చకు ఫుల్ స్టాప్‌ పడుతోందా? ఫ్యామిలి పెద్దల చర్చల్లో వాణి పెట్టిన పంచశీల డిమాండ్లు ఏంటీ? వాటిపై ఆయన సోదరుడు ఏమన్నాడు?. వాణిపెట్టిన డిమాండ్స్ దువ్వాడ శ్రీను ఒప్పకుంటాడా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Duvvada Family: నేటితో దువ్వాడ ఫ్యామిలీ రచ్చకు ఫుల్ స్టాప్‌ పడుతోందా? వాణి పెట్టిన షరతులేంటి..?
Duvvada Family
Balaraju Goud
|

Updated on: Aug 13, 2024 | 7:02 AM

Share

నేటితో దువ్వాడ ఫ్యామిలీ రచ్చకు ఫుల్ స్టాప్‌ పడుతోందా? ఫ్యామిలి పెద్దల చర్చల్లో వాణి పెట్టిన పంచశీల డిమాండ్లు ఏంటీ? వాటిపై ఆయన సోదరుడు ఏమన్నాడు?. వాణిపెట్టిన డిమాండ్స్ దువ్వాడ శ్రీను ఒప్పకుంటాడా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వారం రోజులుగా నడుస్తున్న ఎమ్మెల్సీ దువ్వాల ఫ్యామిలీలో రచ్చకు ఫుల్ స్టాప్ పడుతుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఫైనల్‌గా ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ సభ్యుల చర్చలు ముగిసాయి. రెండు గంటల పాటు చర్చించిన దువ్వాడ బంధువులు.. 5 డిమాండ్లను దువ్వాడ సోదరుడితో చెప్పారు వాణి బంధువులు. ఆస్తుల పంపకం, విడాకులపై సుదీర్ఘంగా చర్చించారు ఇరువర్గాలు. పిల్లలను దృష్టిలో పెట్టుకొని విడాకులు వద్దని నచ్చచెప్పారు వాణి కుటుంబసభ్యులు. తాము జరిపిన చర్చలు సఫలం అవుతాయని.. ఈరోజుతో ఈవివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని వాణి బంధువులు భావిస్తున్నారు. చర్చలు విషయం పక్కన పెడితే.. ఇంత జరిగాక తన అన్న విడాకులకే సిద్ధమయ్యారని చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్‌. మరోసారి అన్న దువ్వాడ శ్రీనివాస్‌తో మాట్లాడాక ఫైనల్ నిర్ణయం చెబుతామన్నారు శ్రీధర్‌.

దువ్వాడ, వాణి విషయం ఇలా ఉంటే.. యాక్సిండెట్ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధురి మాత్రం ఎమోషనల్‌గా మాట్లాడారు. హాస్పిటల్‌ నుంచి వీడియో విడుదల చేశారు మాధురి. మనుషుల్లో మానవత్వం ఉందనుకున్నా.. కానీ మోసం ఉంటుందని తెలుసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు మాధురి.

అయితే ఫైనల్‌గా వాణి, దువ్వాడ శ్రీను మధ్య ఎపిసోడ్‌ చర్చల్లో ఆర్ధిక పరమైన సమస్యలే చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వాణి పెట్టిన 5 డిమాండ్స్ పై దువ్వాడ శ్రీను ఏవిధంగా స్పందిస్తారు? ఆయన సోదరుడు ఒప్పిస్తాడా? అని దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ గొడవకు వాణి డిమాండ్స్ తో ఫుల్ స్టాప్ పడుతుందా? లేక దువ్వాడ ఏమైనా డిమాండ్స్ పెడతాడా? అనే ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
చెన్నైలో రూ.500 కోట్ల ఆస్తులు.. కమెడియన్ సుధాకర్ రియాక్షన్ ఇదే..
చెన్నైలో రూ.500 కోట్ల ఆస్తులు.. కమెడియన్ సుధాకర్ రియాక్షన్ ఇదే..
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
వాడు నా పొట్ట కొట్టాడు..
వాడు నా పొట్ట కొట్టాడు..
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు