AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu: తుది వాదనల అనంతరం తీర్పు.. సుప్రీంలో ఇవాళ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ..

Chandrababu Quash Petition: క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్ట్‌ ఇచ్చే తీర్పు బెంచ్‌ మార్క్‌ గా ఉండబోతుందన్న చర్చ నడుస్తోంది. అలాగే హైకోర్ట్‌లో ముందస్తు బెయిల్‌ పిటిషన్.. ఏసీబీ కోర్ట్‌లో చంద్రబాబు హెల్త్‌ రిపోర్ట్‌పై విచారణ.. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా.. లేదా.. సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే..

Chandrababu Naidu: తుది వాదనల అనంతరం తీర్పు.. సుప్రీంలో ఇవాళ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ..
Chandrababu Cases
Sanjay Kasula
|

Updated on: Oct 17, 2023 | 9:39 AM

Share

ఢిల్లీ, అక్టోబర్ 17: తెలుగు దేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్రబాబుకు ఇవాళ బిగ్‌ డేగా కనిపిస్తోంది. క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్ట్‌ ఇచ్చే తీర్పు బెంచ్‌ మార్క్‌ గా ఉండబోతుందన్న చర్చ నడుస్తోంది. అలాగే హైకోర్ట్‌లో ముందస్తు బెయిల్‌ పిటిషన్.. ఏసీబీ కోర్ట్‌లో చంద్రబాబు హెల్త్‌ రిపోర్ట్‌పై విచారణ.. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా.. లేదా.. సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే ఇరువర్గాలు తమ వాదనలు వినిపించాయి.

అయితే మరోసారి అవకాశం కల్పించాలంటూ సీఐడీ తరపు లాయర్ రోహత్గీ కోరారు. దీంతో ఇవాళ మద్యాహ్నం 2 గంటలకు ఆయన వాదనలు విన్న తర్వాత కోర్ట్ తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ తీర్పు ఎలా ఉండబోతుందనేది ఇవాళ తేలనుంది.

చంద్రబాబు రెగ్యులర్‌ హెల్త్‌ రిపోర్టులను కుటుంబ సభ్యులకు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలంటూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. దీనిపై ఇవాళ వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుకానున్నారు చంద్రబాబు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ACB కోర్టు తెలుసుకున్న తర్వాత ఈ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇవ్వనుంది.

ఇక స్కిల్‌ కేసులో ఇవాళ కూడా విచారణకు హాజరుకానున్నారు కిలారు రాజేష్. నిన్ని 6గంటలకుపైగా సీఐడీ ప్రశ్నించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటున్నారు రాజేష్. సీఐడీ అధికారులు తనను 25 ప్రశ్నలు అడిగారని చెప్పారాయన. ఈ స్కామ్‌లో నిధుల మళ్లింపునకు సంబంధించిన కొన్ని అంశాలపై CID అధికారులు ఆరాతీశారు.

మరోవైపు ఇన్నర్‌రింగు రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈనెల 18కి ఏపీ హైకోర్ట్ వాయిదా వేసింది. IRR అలైన్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో చంద్రబాబును ఏ1గా చేర్చారు అధికారులు. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరపు లాయర్లు.

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో కొత్త ఆధారాలు పరిగణనలోకి తీసుకోవాలన్న సీఐడీ పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్ట్‌ నవంబర్‌ 1కి వాయిదా వేసింది. సీఐడీ అధికారులు ఇచ్చిన ఆధారాలను న్యాయస్థానం పరిశీలించింది. అయితే కేసు రీ ఓపెన్‌పై చంద్రబాబు, నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఇరుపక్షాలకు సూచించింది న్యాయస్థానం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..