Andhra Pradesh: ఎన్టీఆర్‌ విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు.. గుడివాడలో పీక్‌ చేరిన వైసీపీ, టీడీపీ వార్‌..

|

Jun 28, 2022 | 7:10 AM

Andhra Pradesh: గుడివాడలో వైసీపీ, టీడీపీ వార్‌ పీక్‌కి చేరింది. గుడివాడలో తెలుగుదేశం మినీ మహానాడు ప్రకటనతో పొలిటికల్‌ హీట్‌ మొదలైంది.

Andhra Pradesh: ఎన్టీఆర్‌ విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు.. గుడివాడలో పీక్‌ చేరిన వైసీపీ, టీడీపీ వార్‌..
Ntr
Follow us on

Andhra Pradesh: గుడివాడలో వైసీపీ, టీడీపీ వార్‌ పీక్‌కి చేరింది. గుడివాడలో తెలుగుదేశం మినీ మహానాడు ప్రకటనతో పొలిటికల్‌ హీట్‌ మొదలైంది. వైసీపీ, టీడీపీ లీడర్స్‌ మధ్య హాట్‌ హాట్‌ డైలాగ్ వార్‌ నడిచింది. గుడివాడ మినీ మహానాడుకు టీడీపీ అధినేత చంద్రబాబు రానుండటం, ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో బస చేయనుండటంపై మాటల యుద్ధం మొదలుపెట్టింది వైసీపీ. ఏ ముఖం పెట్టుకుని నిమ్మకూరుకి వస్తారంటూ బాబుపై నిప్పులు చెరిగారు మంత్రులు. గుడివాడ సెంట్రల్‌ పాయింట్‌గా సాగుతోన్న పొలిటికల్‌ ఫైట్‌లో ఇప్పుడు అస్సలు ఊహించని ఇన్సిడెంట్‌ జరిగింది.

గుడివాడ రూరల్‌ బొమ్ములూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి వైసీపీ రంగులు వేసే ప్రయత్నం జరిగింది. అప్పటికే ఎన్టీఆర్‌ విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు వేయడంతో షాక్‌ తిన్న తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత విగ్రహం దిమ్మెకు వేసిన వైసీపీ కలర్స్‌ను తొలగించి, మళ్లీ పసుపు రంగు వేశారు.

ఇవి కూడా చదవండి

టీడీపీ మినీ మహానాడు జరగబోతున్న వేదికకు కిలోమీటర్‌ దూరంలో ఈ ఇన్సిడెంట్‌ జరగడంతో స్థానిక తెలుగుదేశం నేతలు అవాక్కయ్యారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వర్రావు అక్కడకెళ్లి, ఎన్టీఆర్‌ విగ్రహాన్ని శుద్ధిచేసి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, టీడీపీ బ్యానర్లపై వైసీపీ జెండాలు కడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడుతున్నారు తెలుగుదేశం నేతలు.