Vizag: చెక్‌పోస్ట్ దగ్గర ఆపకుండా వెళ్లిన కారు.. అనుమానమొచ్చి ఛేజ్ చేయగా మైండ్ బ్లాక్ అయ్యే సీన్

| Edited By: Ravi Kiran

Oct 05, 2024 | 1:11 PM

గంజాయి స్మగ్లర్లు బరి తెగిస్తున్నారు. చాప కింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అడిగినవారికి అడిగినట్టు మూడో కంటికి తెలియకుండా గంజాయి సప్లై చేసి మత్తులో ముంచేస్తున్నారు. తాజాగా విశాఖలో..

Vizag: చెక్‌పోస్ట్ దగ్గర ఆపకుండా వెళ్లిన కారు.. అనుమానమొచ్చి ఛేజ్ చేయగా మైండ్ బ్లాక్ అయ్యే సీన్
Viral
Follow us on

గంజాయి స్మగ్లర్లు బరి తెగిస్తున్నారు. చాప కింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అడిగినవారికి అడిగినట్టు మూడో కంటికి తెలియకుండా గంజాయి సప్లై చేసి మత్తులో ముంచేస్తున్నారు. తాజాగా విశాఖలో లిక్విడ్ గంజాయిని అమ్మకానికి తెచ్చి విఫలయత్నమయ్యారు. పోలీసులు చేజ్ చేసేసరికి.. టూవీలర్‌ను ఢీకొట్టి పారిపోయారు. కొద్ది దూరం వెళ్ళాక కారును ఆపి..

అది విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియా.. రద్దీగా ఉండే ప్రాంతం.. ఓ కారు అక్కడకు వచ్చి ఆగింది.. లోపల అనుమానాస్పదంగా ఉన్నారు. చుట్టుపక్కల గమనిస్తూ ఉన్నారు. ఇంతలో ఏమైందో ఏమో గాని.. ఉన్నట్టుండి కారును హడావిడిగా ముందుకు పోనిచ్చారు. అప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడ మాటు వేసి కూర్చున్నారు. కారు ముందుకెళ్లడంతో.. వెనుక పోలీసులు చేజ్ చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సంఘం శరత్ జంక్షన్ వద్దకు వచ్చేసరికి సిగ్నల్ పడింది. ముందు వాహనాలు ఉన్నాయి.. అప్పుడే వెనకనుంచి వచ్చిన పోలీసులు బైక్ను కారుకు అడ్డంగా పెట్టారు. మరి కొంతమంది కారులో ఉన్న వారిని బయటకు దిగమంటున్నారు. ఈ లోగా గ్రీన్ సిగ్నల్ పడడంతో.. కారును ముందుకు పోనిచ్చారు.

దీంతో కానిస్టేబుల్ టూవీలర్ ధ్వంసం అయింది. పోలీసులు తేరుకునే లోగా రయ్యిన పారిపోయారు. చివరకు.. BHEL వద్ద ఆ కారు వదిలి మాయమయ్యారు. పోలీసులు చేజ్ చేసుకుని వెళ్లి చూసేసరికి అక్కడ కారు తప్ప ఎవరూ కనిపించలేదు. దీంతో కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో లిక్విడ్ గంజాయి ఉన్నట్టు గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నరు పోలీసులు. ఈ ఘటనపై సిపి బాగ్చి ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేసును పోలీసులు అత్యంత గోప్యంగా విచారిస్తున్నారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అని దానిపై కూపీ లాగుతున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..