AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eluru: పక్షవాతం.. కాళ్లు, చేతులు పట్టుకుపోయిన స్థితిలో ఆస్పత్రికి.. గంటలోనే అద్భుతం

పక్షవాతం వచ్చిన మహిళను నడవలేని స్థితిలో స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తీసుకువచ్చారు. గంటలోనే చికిత్స ఇచ్చి ఆమెను నడిచేలా చేశారు అక్కడి వైద్యులు. ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఈ కథనం లోపల తెలుసుకుందాం పదండి .

Eluru: పక్షవాతం.. కాళ్లు, చేతులు పట్టుకుపోయిన స్థితిలో ఆస్పత్రికి.. గంటలోనే అద్భుతం
Hospital (Representative image)
Ram Naramaneni
|

Updated on: Jul 15, 2025 | 2:38 PM

Share

పక్షవాతంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళకు ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో అద్భుతమైన చికిత్స అందించారు. కేవలం గంటలో ఆమె తిరిగి కాళ్లు, చేతులు కదిలించగలిగే స్థితికి చేరుకున్నారు. పెదవేగికి చెందిన 60 ఏళ్ల వెంకటేశ్వరమ్మ ఈ నెల 12వ తేదీ ఉదయం కుడికాలు, కుడిచేయి బిగిసిపోయిన లక్షణాలతో ఆస్పత్రికి తీసుకువచ్చారు. తక్షణమే స్ట్రెచర్‌పై అత్యవసర విభాగానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిస్థితిని గమనించిన వైద్యులు ఆమెకు పక్షవాతం వచ్చిందని నిర్ధారించారు. లక్షణాలు బయటపడిన నాలుగు గంటల్లో థ్రాంబోలైసిస్‌ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కోలుకునే అవకాశముందని భావించి వెంటనే రూ.30-40 వేల విలువ చేసే ఆ ఇంజెక్షన్‌ను ఇచ్చారు.

డాక్టర్ విద్యాసాగర్‌ పర్యవేక్షణలో జూనియర్‌, పీజీ వైద్యులు చికిత్స చేశారు. గంటలోపే ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. సాయంత్రానికి తానే లేచి నడవగలిగినంత స్థాయిలో కోలుకుంది. ఇంతకుముందు ఇలాంటి కేసులను గుంటూరుకు రిఫర్‌ చేసేవారు. కానీ ప్రస్తుతం ఏలూరు బోధనాసుపత్రిలో న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ విద్యాసాగర్ అందుబాటులో ఉండటంతో… ఇప్పుడు స్థానికంగానే స్ట్రోక్ రోగులకు పూర్తి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిపై స్థానిక ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..