AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏంట్రా ఇది.. పీకలదాక తాగి మందు బాబు వీరంగం.. చికెన్ పకోడి లేదన్నాడని దారుణం..

ఫుల్లుగా పీకలదాక తాగాడు.. చికెన్ పకోడి కోసం వెళ్లాడు.. ఈ క్రమంలో యజమాని చికెన్ పకోడి లేదంటూ అతనికి చెప్పాడు.. కానీ.. అతను మాత్రం వినిపించుకోలేదు.. చికెన్ పకోడి కావాలంటూ యజమానితో గొడవకు దిగాడు.. చూస్తుండగానే.. చికెన్ పకోడి వివాదం.. పెద్దదిగా మారింది.. చికెన్ పకోడి లేదంటావా అంటూ.. హోటల్ యజమానిని దారుణంగా చంపాడు..

Andhra: ఏంట్రా ఇది.. పీకలదాక తాగి మందు బాబు వీరంగం.. చికెన్ పకోడి లేదన్నాడని దారుణం..
Chicken Pakoda
Shaik Madar Saheb
|

Updated on: Jul 07, 2025 | 6:20 PM

Share

ఫుల్లుగా పీకలదాక తాగాడు.. చికెన్ పకోడి కోసం వెళ్లాడు.. ఈ క్రమంలో యజమాని చికెన్ పకోడి లేదంటూ అతనికి చెప్పాడు.. కానీ.. అతను మాత్రం వినిపించుకోలేదు.. చికెన్ పకోడి కావాలంటూ యజమానితో గొడవకు దిగాడు.. చూస్తుండగానే.. చికెన్ పకోడి వివాదం.. పెద్దదిగా మారింది.. చికెన్ పకోడి లేదంటావా అంటూ.. హోటల్ యజమానిని దారుణంగా చంపాడు.. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జిల్లాలో చోటుచేసుకుంది.. మద్యంమత్తులో ఉన్న ఓ వ్యక్తి చికెన్ పకోడీ లేదన్నాడని.. హోటల్‌ యజమానిని పీకకోసి చంపేశాడు.

వివరాల ప్రకారం..

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసప గ్రామానికి చెందిన మిన్నారావు అనే యువకుడు ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగాడు.. ఆ తర్వాత మద్యం మత్తులో సమీపంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వెళ్లి.. చికెన్ పకోడీ కావాలంటూ అడిగాడు.. అయితే షాపు యజమాని శంకర్‌.. చికెన్ పకోడి లేదని మిన్నారావుకి చెప్పాడు. అయితే.. అలా కాదు.. తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ చికెన్ పకోడీ ఇవ్వాల్సిందే అంటూ శంకర్ ను పట్టుబట్టాడు.

శంకర్ లేదని చెప్పినా.. వినకుండా మిన్నారావు.. షాపు తలుపులను గట్టిగా తన్నుతూ శంకర్‌పై దాడి చేయబోయాడు.. ఇక్కడ వారి మధ్య వాదన పెరిగి.. కొట్టుకునే వరకు వెళ్లింది.. అప్పటికే మద్యం తాగి మత్తులో ఉన్న మిన్నారావు.. పక్కనే ఉన్న సుత్తిని తీసి శంకర్ తలపై బలంగా కొట్టాడు. ఆ తర్వాత.. పక్కనే ఉన్న కత్తిని తీసి పీక కోశాడు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుకు అవతల వైపు ఉన్న కాలువలో పడేసి.. అక్కడి నుంచి వెళ్లాడు..

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా