వీఎంఆర్‌డీఏ తొలి ఛైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2019 | 3:39 PM

విశాఖపట్నం: వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్‌ అధారిటీ (వీఎంఆర్‌డీఏ) తొలి ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్‌ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శ్యామల రావు ఉత్తర్వులు జారీ చేశారు. 2016 లో వీఎంఆర్‌డీఏ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఛైర్మన్‌ నియామకం జరగడం ఇదే తొలిసారి. ద్రోణం రాజు శ్రీనివాస్ తాజా ఎన్నికల్లో  విశాఖ సౌత్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ […]

వీఎంఆర్‌డీఏ తొలి ఛైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్
Follow us on

విశాఖపట్నం: వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్‌ అధారిటీ (వీఎంఆర్‌డీఏ) తొలి ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్‌ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శ్యామల రావు ఉత్తర్వులు జారీ చేశారు. 2016 లో వీఎంఆర్‌డీఏ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఛైర్మన్‌ నియామకం జరగడం ఇదే తొలిసారి.

ద్రోణం రాజు శ్రీనివాస్ తాజా ఎన్నికల్లో  విశాఖ సౌత్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రభుత్వ ఛీఫ్ విప్‌గా కూడా పని చేశారు. ఇప్పటి వరకు వీఎంఆర్‌డీఏ తాత్కాలిక ఛైర్మన్‌గా మున్సిపల్‌ శాఖ కార్యదర్శి వ్యవహరించేవారు.