Pawan Kalyan: ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు ట్రెండ్ సెట్ చేస్తా.. పాలనలో పవన్ కల్యాణ్ మార్క్..!

|

Jun 25, 2024 | 12:13 PM

ఎవరైనా సరే పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పౌరసరఫరాల శాఖ, టూరిజం, సినిమాటోగ్రఫీలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా గూగుల్ ఫామ్ ను ఫిల్ చేసేలా ఏర్పాటు చేశారు.

Pawan Kalyan: ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు ట్రెండ్ సెట్ చేస్తా.. పాలనలో పవన్ కల్యాణ్ మార్క్..!
Pawan Kalyan Dy Cm
Follow us on

ప్రజల్లో జనసేన మార్క్ దిశగా డిప్యూటి సిఎం పవన్ అడుగులు వేస్తున్నారు. జనసేన తీసుకున్న శాఖలపై ప్రజా సూచనలు, సలహాలకు క్యూ అర్ కోడ్ విడుదల చేశారు. గూగుల్ ఫామ్ ద్వారా సలహాలు, సూచనలు కోరుతున్నా డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్. ఎవరైనా సరే పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పౌరసరఫరాల శాఖ, టూరిజం, సినిమాటోగ్రఫీలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా గూగుల్ ఫామ్ ను ఫిల్ చేసేలా ఏర్పాటు చేశారు.

ఉప ముఖ్యమంత్రిగా పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో ఇద్దరు జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. పౌరసరఫరాశాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్‌, సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖ మంత్రిగా కందుల దుర్గేష్‌ బాధ్యతలు చేపట్టారు.

అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్.. జనతా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. జనసేన కార్యాలయం వద్ద జనవాణి నిర్వహిస్తూ బాధితుల సమస్యలు వింటూ.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అవసరమైతే స్వయంగా అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తున్నారు జనసేన అధినేత. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పాలన సమర్థంగా నిర్వహించేందుకు జనసేన సాంకేతికత సాయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. మంత్రులకు కేటాయించిన శాఖలకు సంబంధించి ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే QR కోడ్ స్కాన్ చేసి సలహాలు, సూచనలు పంపండి అంటూ జనసేన ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఏపీ ప్రజలకు సూచించింది. క్యూఆర్ కోడ్ స్కా్న్ చేయడం ద్వారా లేదంటే లింక్ ద్వారా గూగుల్ ఫామ్ నింపాలని జనసేన పేర్కొంది. ఈ మేరకు క్యూఆర్ కోడ్, లింక్‌లను ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

జనసేన పార్టీ ప్రకటనపై నెటిజనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. మంచి ఆలోచన అని, ఇందులో మరికొన్ని అంశాలను కూడా చేర్చాలంటూ నెటిజస్లు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..