అది ఈస్ట్ గోదావరి జిల్లాలోని గోపాలపురం మండలం నందిగూడెం గ్రామం. సన్నని జల్లులు పడుతున్నాయ్.. పొలం పనులు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. సర్లే ముసురుకు నాలుగు చేపలు పట్టుకుని పులుసు పెట్టుకుని తిందామని వారు భావించారు. అనుకున్నదే తడవుగా వల తీసుకుని.. స్థానికంగా ఉన్న వీరదమ్మ చెరువుకు వెళ్లారు. ఈ క్రమంలో బొచ్చ, బురదమట్ట.. చేపలు చిక్కాయి. అరె.. ఈ రోజు భలే చేపలు భలే పడ్డాయ్ అని అనుకున్నారు. ఈ క్రమంలోనే వలలో చేపల తీస్తుండగా.. ఓ వింత చేప కూడా తారసపడింది.
అది సుమార్ అర కేజీ బరువు ఉంటుంది. చూడటానికి వింత రంగులో భయానకంగా ఉంది. చిత్రంగా ఈ చేపకు నోరు కింద భాగంలో ఉంది. తమ ఏరియాలో ఇలాంటి చేపను గతంలో చూడలేదని.. అసలు దాని పేరు కూడా తెలీదని స్థానికులు తెలిపారు. అయితే అలాంటి.. ఇలాంటి చేప కాదండోయ్.. దెయ్యం చేప అట. అవును దీన్ని సుకర్ ఫిష్ అని కూడా అంటారని.. స్థానిక మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి చేపలు బంగ్లాదేశ్‌లో ఎక్కువగా కనిపిస్తాయన్నారు. పుట్టిన తొలినాళ్లలో నాచు తిని.. తరువాత చిన్న చిన్న చేపల్ని ఆహారంగా తీసుకుంటాయని వెల్లడించారు. వీటిని మనుషులు తినకూడదని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.