AP News: చైనా నుంచి దిగుమతి అయిన 333 వెల్లుల్లి బస్తాలు.. అధికారులు తనిఖీ చేయగా..

| Edited By: Ram Naramaneni

Nov 21, 2024 | 11:48 AM

ఎప్పుడో 2003లోనే చైనా నుంచి వెల్లుల్లి దిగుమతిని నిషేధించింది కేంద్రం. కానీ అక్రమ మార్గాల ద్వారా అది వస్తూనే ఉంది. తాజాగా అధికారులు ఆ సరుకును పట్టుకోగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి...

AP News: చైనా నుంచి దిగుమతి అయిన 333 వెల్లుల్లి బస్తాలు.. అధికారులు తనిఖీ చేయగా..
Fungus Infected Garlic
Follow us on

మనదేశంలోకి చైనా నుంచి ఎన్నో రకాల వస్తువులు దిగుమతి అవుతూ ఉంటాయి.. దిగుమతి అయ్యే వాటిలో చాలా వస్తువులు తక్కువ క్వాలిటీవి ఉంటాయి.. చైనా నుంచి దిగుమతి అయ్యే వెల్లుల్లిపై ఇప్పటికే కేంద్రం నిషేధం విధించింది.. అయినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటించి దేశంలోకి పంపిస్తున్నారు అక్రమార్కులు.. దీనిపై కస్టమ్స్ అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు తనిఖీలు చేయగా..  భారీగా పాడయిపోయిన అల్లం వెల్లుల్లి పట్టుబడింది..

చైనా  అనగానే చీప్ క్వాలిటీ వస్తువులు దొరుకుతాయని అందరికీ తెలుసు.. ఎలాంటి వస్తువు అయినా డూప్లికేట్.. తక్కువ ధరకు తయారు చేయడం చైనా వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.. వాటిని కొనుగోలు చేసి.. ఆ తర్వాత కొందరు నష్టపోయామని గ్రహిస్తారు.. ఒక్క మనదేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో చైనా ఉత్పత్తి చేసిన వస్తువులు వినియోగంలో ఉన్నాయి.. అయితే క్వాలిటీ లేని చైనా ప్రొడక్ట్స్ దిగుమతి చేసుకోవడం కొన్ని దేశాలు నిలిపివేశాయి.. ఇక మన దేశం సరిహద్దుల్లో తరచు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాతో వ్యాపార ఒప్పందాలను తగ్గించి…  వస్తువుల కోసం ఆ దేశం మీద ఆధారపడకుండా భారత్ దిగుమతులను తగ్గించుకుంది.. దీనిలో భాగంగానే గతంలో చైనా నుంచి వచ్చే వెల్లుల్లి దిగుమతిని కేంద్రం నిషేధించింది..అయినా అక్రమంగా చైనా వెల్లుల్లి భారత్‌లోకి ప్రవేశించి పలు ప్రదేశాలకు వెళ్తున్నట్లుగా అధికారులకు సమాచారం రావడంతో దీనిపై నిగా పెట్టారు.

తాజాగా చైనా నుంచి దిగుమతి అయిన తెగులు సోకిన వెల్లుల్లిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఇటీవలి కాలంలో చైనా నుంచి వెల్లుల్లి ఎక్కువగా దిగుమతి అవుతున్న నేపథ్యంలో విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు.

నెల్లూరుకు సమీపంలో 9,990 కిలోల వెల్లుల్లి బస్తాలతో వెళ్తున్న వ్యానును బుధవారం పట్టుకున్నారు. రూ.21.97 లక్షల విలువైన సరుకు… 333 బస్తాలు వ్యాన్లో ఉన్నట్టు గుర్తించారు. కేంద్రం తీసుకొచ్చిన ప్లాంట్ క్వారంటైన్ 2003 ఉత్తర్వుల ప్రకారం చైనా వెల్లుల్లిని దిగుమతి చేసుకోవడం నిషేధం. బిహార్‌లోని జహంజర్పూర్ నుంచి ఈ సరుకును తమిళనాడులోని కోయంబేడుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. ఈ వెల్లుల్లి నమూనాలను ల్యాబ్ టెస్టింగ్‌కి పంపగా వాటికి ఎంబెల్లిసియా అల్లి పొడి తెగులు ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..