Kurnool: ఇవి పులి పిల్లలు కావు.. అలా అని పిల్లి పిల్లలు కావు.. ఏవో మీకు తెల్సా..?

| Edited By: Ram Naramaneni

Nov 21, 2024 | 1:34 PM

వన్యమృగాలు అడవులను వదిలి పంటపొలాల్లో సంచరిస్తుండటంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులులు పొలాలు, గుట్టల్లో సంచరిస్తూ పశువులు, మనుషులపై కూడా దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా కర్నూలు జిల్లాలో పులిపిల్లలు కలకలం రేపాయి. ఓ పొలంలో కనిపినించిన పులి పిల్లలను చూసి రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

1 / 5
 కర్నూలు జిల్లాలో జిల్లాలోని కొత్తపల్లి శివారు వరిపొలంలో నాలుగు పులిపిల్లలను పోలిఉన్న నాలుగు కూనలు రైతులకు కనిపించాయి. ఇటీవలే ఇదే ప్రాంతంలో ఓ పెద్దపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.

2 / 5
అందులో ఒకటి చనిపోగా మిగతా మూడింటిని రక్షించి తిరుపతి జూకి తరలించారు అటవీశాఖ అధికారులు

3 / 5
ఇప్పుడు మరోసారి ఈ కూనలు కనిపించడంతో ఇక్కడ పొలాల్లో పులులు సంచరిస్తున్నాయని, ఏక్షణంలోనైనా పిల్లలకోసం అవి అక్కడకు రావచ్చని భయపడుతున్నారు స్థానికులు.

4 / 5
అయితే అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆ కూనలను పరిశీలించారు. అవి పులి పిల్లలు కావని, జంగం పిల్లి పిల్లలని తేల్చారు. అయితే అవి పులి పిల్లలను పోలి ఉండటంతో ప్రజలు భయపడ్డారు.

5 / 5
 ఆ తర్వాత తల్లి పిల్లి వచ్చి పిల్లలను తీసుకెళ్లిపోయింది. దాంతో  అందరూ ఊపిరి పీల్చుకున్నారు.