Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం.. సెక్యూరిటీ పేరుతో అర్చకులను అడ్డుకున్న వైనం..

|

Sep 28, 2022 | 12:51 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల అతుత్సాహం ప్రదర్శించారు. ఆలయ స్థానాచార్య, ప్రధాన అర్చకులను అడ్డుకున్నారు పోలీసులు.

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం.. సెక్యూరిటీ పేరుతో అర్చకులను అడ్డుకున్న వైనం..
Vijayawada Durga Temple Pri
Follow us on

విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల అతుత్సాహం ప్రదర్శించారు. ఆలయ స్థానాచార్య, ప్రధాన అర్చకులను అడ్డుకున్నారు పోలీసులు. డ్యూటీ పాస్‌లు చూపించినా…లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు. అంతేకాదు నీకు నచ్చింది చేసుకో అంటు దురుసుగా మాట్లాడారు. దాంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అర్చకులు. సెక్యూరిటీ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అర్చకులు మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ బ్యారీ గేట్లు పెట్టి మరీ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అడిగితే ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రకారం పని చేస్తున్నామంటున్నారు పోలీసులు. పరిస్ధితి ఇలానే ఉంటే విధులు నిర్వర్తించలేమని తెగేసి చెబుతున్నారు పురోహితులు. కాగా, ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు స్పందించారు. ఘటనపై జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఆలయ ఈవో భ్రమరాంబ ఆరాతీస్తున్నారు.

ఘనంగా శరన్నవరాత్రుల ఉత్సవాలు..

ఇదిలాఉంటే.. ఇంద్రకీలాద్రిపై మూడవ రోజు దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీతానగరంలోని వేదవిశ్వవిద్యాలయంలో ప్రముఖ వేదగురువు త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఇవాళ ధనలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

విజయకీలాద్రి పైనుంచి అమ్మవారిని ఊరేగింపుగా కిందకు తీసుకొచ్చి యజ్ఞశాలలో ప్రతిష్టించారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత 74 మంది వేదపండితులతో మత్రోచ్ఛారణ జరిగింది. సాయంత్రం ప్రత్యేక ఉరేగింపుతో అమ్మవారిని విజయకీలాద్రి పైకి తీసుకెళతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..