AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడెల ఇంటి వద్ద హైడ్రామా.. ఇంటి సమీపంలోనే దొరికిన కంప్యూటర్

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు చెందిన సత్తెనపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర హై డ్రామా నడుస్తోంది. ఆఫీస్‌ నుంచి గత రాత్రి కంప్యూటర్ల చోరికి గురికావడం సంచలనం రేపింది. హైదరాబాద్‌ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్‌ తరలించిన సందర్భంగా వాటిని తన ఆఫీసులకు తరలించుకున్న వివాదం మరింత ముదురుతోంది. హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చే సమయంలో ఫర్నిచర్‌ను కొత్త అసెంబ్లీకి కాకుండా తన క్యాంప్‌ ఆఫీస్‌లకు తరలించుకున్నట్లు కోడెల ఇప్పటికే అంగీకరించారు. వాటిని ప్రభుత్వానికి అప్పగిస్తానని కూడా […]

కోడెల ఇంటి వద్ద హైడ్రామా.. ఇంటి సమీపంలోనే దొరికిన కంప్యూటర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 23, 2019 | 10:40 AM

Share

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు చెందిన సత్తెనపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర హై డ్రామా నడుస్తోంది. ఆఫీస్‌ నుంచి గత రాత్రి కంప్యూటర్ల చోరికి గురికావడం సంచలనం రేపింది. హైదరాబాద్‌ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్‌ తరలించిన సందర్భంగా వాటిని తన ఆఫీసులకు తరలించుకున్న వివాదం మరింత ముదురుతోంది. హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చే సమయంలో ఫర్నిచర్‌ను కొత్త అసెంబ్లీకి కాకుండా తన క్యాంప్‌ ఆఫీస్‌లకు తరలించుకున్నట్లు కోడెల ఇప్పటికే అంగీకరించారు. వాటిని ప్రభుత్వానికి అప్పగిస్తానని కూడా చెప్పారాయన. అయితే తప్పు జరిగినట్లు కోడెల అంగీకరించారని, ఇలాంటి వ్యవహారాలు కోడెలకు కొత్త కాదని విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నాయకులు.

మరోవైపు కోడెల క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి కంపూటర్లు, ఫర్నిచర్‌ను అసెంబ్లీ సిబ్బంది స్వాధీనం చేసుకుందామనుకుంటున్న తరుణంలో గత రాత్రి పది గంటల సమయంలో సత్తెనపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌కు ఇద్దరు దుండగులు వచ్చి కంపూటర్లను ఎత్తుకెళ్ళారు. దీనిపై ఆఫీస్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి పోలీసులు వచ్చి ఆఫీస్‌ను పరిశీలించి వెళ్లారు. అయితే ఈ ఉదయం వెతికితే కోడెల ఇంటి సమీపంలోనే కంపూటర్లు దొరికాయి. కార్యాలయ సిబ్బంది వాటిని తిరిగి లోనికి తీసుకెళ్ళారు. కంప్యూటర్లలోని డేటా చోరీ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే