యామినీ కృష్ణమూర్తి కన్నుమూత.. నిండు పౌర్ణమి రోజున జన్మించడంతో..

|

Aug 03, 2024 | 10:02 PM

యామినీకి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. ఢిల్లీలో యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ స్థాపించి ఎంతో మంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చారు.

యామినీ కృష్ణమూర్తి కన్నుమూత.. నిండు పౌర్ణమి రోజున జన్మించడంతో..
Yamini Krishnamurthy
Follow us on

ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. భరత నాట్యం, కూచిపూడి నృత్యంతో భారత దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన యామినీ కృష్ణమూర్తి.. పదహారణాల తెలుగింటి ఆడపడుచు. ఏపీలోని మదనపల్లెలో కృష్ణమూర్తి దంపతులకు 1940లో యామిని జన్మించారు. నిండు పౌర్ణమి రోజున జన్మించడంతో తాత గారు ఆమెకు యామినీ పూర్ణ తిలక అంటూ నామకరణం చేశారు.

క్షీరసాగర మథనంలో మోహినీగా, భామాకలాపంలో సత్యభామ, ఉషాపరిణయంలో ఉషగా, శశిరేఖాపరిణయంలో శశిరేఖగా
ఎన్నో నృత్యరూపకాల్లో పలు పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. యామినీకి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. ఢిల్లీలో యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ స్థాపించి ఎంతో మంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి