AP Weather Report: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

|

Sep 09, 2021 | 3:45 PM

AP Weather Report: ఏపీలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురియనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలోని..

AP Weather Report: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
Follow us on

AP Weather Report: ఏపీలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురియనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఏజెన్సీలోని అనేక ప్రాంతాలు సహా పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యే నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల 11న ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది తదుపరి 48 గంటలలో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇవీ కూడా చదవండి:

Debit Cards: ఇంటర్నెట్‌ లేకున్నా డెబిట్‌ కార్డు వాడవచ్చు.. అందుబాటులోకి రానున్న కొత్త టెక్నాలజీ..!

Mercedes Benz: టెస్లాకు పోటీగా మరో సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి చార్జింగ్‌తో 660 కిలో మీటర్లు