AP Local Body Elections: ఎన్నికల సంఘం కమిషనర్ వెర్సస్ ప్రభుత్వం.. మధ్యలో నలిగిపోతున్న అధికారులు

|

Feb 05, 2021 | 8:55 PM

అటు ఎన్నికల సంఘం కమిషనర్, ఇటు ప్రభుత్వం. మధ్యలో కలెక్టర్లు, అధికారులు. ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకి మధ్య వార్‌లో సిబ్బంది నలిగిపోతోంది. మొన్నటి వరకు పైస్థాయిలో

AP Local Body Elections: ఎన్నికల సంఘం కమిషనర్ వెర్సస్ ప్రభుత్వం.. మధ్యలో నలిగిపోతున్న అధికారులు
Follow us on

AP Local Body Elections: అటు ఎన్నికల సంఘం కమిషనర్, ఇటు ప్రభుత్వం. మధ్యలో కలెక్టర్లు, అధికారులు. ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకి మధ్య వార్‌లో సిబ్బంది నలిగిపోతోంది. మొన్నటి వరకు పైస్థాయిలో డిష్యుం డిష్యుం నడిచింది. ఇప్పుడు ఉద్యోగుల భుజంపై నుంచి కాల్పులు జరుపుకుంటున్నాయి ఇరు వర్గాలు. రెండు వైపుల నుంచి వస్తున్న వార్నింగ్‌లతో బెంబేలెత్తిపోతున్నారు అధికారులు. తొలి దశలో ఏకగ్రీవాలే తాజా వార్నింగ్‌లకు కారణం. ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఏకగ్రీవాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఆసాధారణ రీతిలో ఏకగ్రీవాలు జరిగితే అధికారుల వైఫల్యమేనని వార్నింగ్‌ కూడా ఇచ్చారు. 20 శాతం వరకు గతంలోనూ ఏకగ్రీవాలు జరిగాయని, దానికి మించితే ప్రత్యేక ఫోకస్‌ ఉంటుందని చెప్పినట్టుగానే చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్ల నుంచి నివేదిక కోరారు. ఈ ఆదేశాలపై పైర్‌ అవుతోంది అధికార వైసీపీ. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి ఏకంగా అధికారులకే వార్నింగ్‌ ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా చేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆదేశాలు పాటిస్తే చర్యలు తప్పవన్నారు మంత్రి.

ఇప్పటికే రిటర్నింగ్‌ ఆఫీసర్లు విజేతలను డిక్లేర్‌ చేశారు కాబట్టి… ఇప్పుడు ఆపడం చట్ట విరుద్ధమంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి. మధ్యలో ఆపడానికి అధికారులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. నిబంధనలను పాటించని వారిని బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని కూడా వార్నింగ్‌ ఇచ్చారు. ఎస్‌ఈసీ మాత్రం సరిగా స్పందించడం లేదని కొంతమంది అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. వాళ్ల స్థానంలో కొత్తవాళ్లను నియమించారు. ఈ వార్నింగ్‌లతో అధికార యంత్రాంగం తీవ్ర ఒత్తిడిగి గురవుతోంది. ముఖ్యంగా ఐఏఎస్‌లకు మాత్రం ఇది ఎక్కువగా బాధిస్తున్న ఇష్యూ. పోలింగ్‌కు సిద్ధమయ్యే సమయంలో ఈ కొత్త వివాదాన్ని ఎలా పరిష్కరించాలో తెలియక… అధికారులు టెన్షన్ పడుతున్నారు. రాజకీయం సంగతి ఎలా ఉన్నా… కింది స్థాయిలో ఎన్నికల అధికారులు మాత్రం నలిగిపోతున్నామని ఆఫ్‌ది రికార్డ్‌గా కామెంట్ చేస్తున్నారు.

Also Read:

AP Local Body Elections: ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు.. ఘాటు పదజాలంతో సూటి విమర్శలు

దేహమే మందిరం.. ఒళ్లంతా పచ్చ బొట్లు.. ఆ తెగ పలుకులోనూ, పనిలోనూ నిత్యం మర్యాదా పురుషోత్తముడే