Andhra Pradesh: విజయవాడలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డ మైనర్‌ బాలికలు.. ఈ కథనాల్లో నిజం ఎంత.? పోలీసుల వివరణ ఇదే..

|

Oct 04, 2022 | 10:18 AM

విజయవాడలో ఇద్దరు మైనర్‌ బాలికలు గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గంజాయి సేవిస్తున్న 12, 13 ఏళ్ల ఇద్దరు విద్యార్థినులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

Andhra Pradesh: విజయవాడలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డ మైనర్‌ బాలికలు.. ఈ కథనాల్లో నిజం ఎంత.? పోలీసుల వివరణ ఇదే..
Factcheck
Follow us on

విజయవాడలో ఇద్దరు మైనర్‌ బాలికలు గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గంజాయి సేవిస్తున్న 12, 13 ఏళ్ల ఇద్దరు విద్యార్థినులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటూ వార్తలు తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ వార్తలపై పోలీసులు అధికారికంగా స్పందించారు. అలాగే నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్తలకు ట్విట్టర్‌ వేదికగా ఫ్యాక్ట్‌చెక్‌.ఏపీ.జీఓవీ.ఇన్‌ పేరుతో క్లారిటీ ఇచ్చారు.

ఈ విషయమై అధికారులు ట్వీట్‌ చేస్తూ.. ‘ఇద్దరు మైనర్‌ బాలికలు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారన్న వార్తలు పూర్తిగా నిరాధారణమైనవి. మైనర్‌లకు సంబంధించిన రిపోర్టింగ్‌పై బాధ్యతాయుతంగా ఉండాలి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక మైనర్‌ బాలికలు గంజాయి తీసుకున్నారన్న వార్తలకు సంబంధించి అసలు విషయాన్ని వివరిస్తూ.. ‘సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజ్వల హోమ్‌ నుంచి ఇద్దరు బాలికలు తప్పించుకున్నారు. దీనిపై ఫిర్యాదు స్వీకరించిన వెంటనే విచారణ ప్రారంభించి బాలికల ఆచూకి తెలుసుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించాం’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మైనర్‌ బాలికలు గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డారంటూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాతో పాటు పలు ట్రెడిషనల్‌ మీడియాలోనూ వార్తలు రావడంతో పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేయడానికి సోషల్‌ మీడియా వేదికగానే పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..