Earthquake: చిత్తూరు జిల్లాలో టెన్షన్ టెన్షన్.. రామకుప్పం మండలంలో ఆగని భూ ప్రకంపనలు..

|

Nov 26, 2021 | 9:59 PM

Earthquake: చిత్తూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రామకుప్పం మండలంలో భూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి.

Earthquake: చిత్తూరు జిల్లాలో టెన్షన్ టెన్షన్.. రామకుప్పం మండలంలో ఆగని భూ ప్రకంపనలు..
Earthquake
Follow us on

Earthquake: చిత్తూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రామకుప్పం మండలంలో భూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా మండలం పరిధిలోని ఎస్. గొల్లపల్లి, గురివి మాకులపల్లి, కృష్ణా నగర్ కాలని, ఎద్దుల గట్టు గ్రామాల్లో భూమి కంపించింది. భూమి పొరల నుంచి భారీ శబ్ధాలు వస్తున్నాయి. ఆయా గ్రామాల్లో భూమి వరుసగా కంపించింది. దాంతో తీవ్ర భయాందోళనకు గురైన జనాలు.. ఇళ్లు వదిలి పొలాల్లోకి పరుగుల పెడుతున్నారు. మరోవైపు.. ఏనుగుల బెడద కూడా అక్కడి ప్రజలను వేధిస్తోంది. ఇదే గ్రామాల పొలాల్లో వారం రోజులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి. దాంతో ప్రజలు పొలాల్లోకి వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భూ ప్రకంపనలతో ఇళ్లల్లో ఉండలేక, ఏనుగుల సంచారంతో పొలాల్లోకి వెళ్లకుండా ప్రజలు రోడ్లపైనే ఉండాల్సి వస్తోంది. మరోవైపు విద్యుత్ సరఫరాలో అంతరాయంతో బాధిత గ్రామాలన్నీ చిమ్మచీకట్లో మగ్గిపోతున్నాయి.

ఇదిలాఉంటే.. గురువారం రాత్రి కూడా రామకుప్పం మండలంలోని పలు గ్రామాల్లో భూప్రకంపనలు సంభవించాయి. గడ్డూరు, పెద్దగరిగేపల్లి, యానాదికాలనీ, పంద్యాల మడుగు గ్రామాల్లో భూమి కంపించింది. నిన్న రాత్రి నుంచి భూమి పొరల్లో శబ్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకు శబ్దాలు పెరుగుతుండటంతో జనాలు హడలిపోతున్నారు.

Also read:

Vladimir Putin: భారత్ రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. కీలకం కానున్న రష్యా-భారత్ ద్వైపాక్షిక చర్చలు

Mental Health: మీ వ్యవహార శైలిలో ఈ మార్పులు కనిపిస్తుంటే మీ మానసిక ఆరోగ్యం పాడైనట్టే..వెంటనే నిపుణులను సంప్రదించాల్సిందే!

Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇవే..