Municipal Elections 2021: ప్రశాంతంగా ముగిసిన ఏపీ మున్సిపల్ పోలింగ్.. మొత్తం పోలింగ్ శాతం ఎంతంటే..!

|

Mar 10, 2021 | 10:58 PM

AP Municipal Elections:ఏపీలో జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ రిలీజ్ చేశారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. కార్పొరేషన్‌ లో 57.41 శాతం, మున్సిపల్‌లో 70.65శాతం పోలింగ్ నమోదైందన్నారు.

Municipal Elections 2021: ప్రశాంతంగా ముగిసిన ఏపీ మున్సిపల్ పోలింగ్.. మొత్తం పోలింగ్ శాతం ఎంతంటే..!
AP Municipal Elections 2021
Follow us on

AP Municipal Poll: ఏపీలో జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ రిలీజ్ చేశారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. కార్పొరేషన్‌ లో 57.41 శాతం, మున్సిపల్‌లో 70.65శాతం పోలింగ్ నమోదైందన్నారు. రీపోలింగ్‌ లేకుండా తొలిసారి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించామన్నారాయన. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటేసేందుకే ఓటర్లు ఎక్కువగా ఆసక్తి చూపించారన్నారు.

జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరామన్నారు నిమ్మగడ్డ. ఎన్నికల్లో పాల్గొన్న వాలంటీర్లపై కోర్టు తీర్పు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల్ని స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. గెలుపోటముల లెక్కలు తేలాలంటే…14వరకు ఆగాల్సిందే.

స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సుల భద్రతపై ఎస్‌ఈసీ దృష్టి సారించింది. నిరంతరం పర్యవేక్షించేందుకు వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. భద్రతకు సంబంధించి రాజకీయ పార్టీలకు అనుమానాలు ఉన్నాయి.. అందుకే పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అన్నారు నిమ్మగడ్డ. 14న రాజకీయ పార్టీల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి..

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..

COVID-19: కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న బ్రెజిల్.. 80శాతం ఐసీయూలు ఫుల్.. నిన్న ఒక్క రోజే 1972 మంది మృతి..