Botsa Satyanarayana: అంగన్వాడీల ఆందోళనపై స్పందించిన మంత్రి బొత్స.. జీతాల పెంపుపై ఏమన్నారంటే..

|

Dec 29, 2023 | 4:45 PM

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల నిరసనలు కొనసాగుతున్నాయి. సమ్మె సైరన్ మోగించి వారం గడిచింది. గతంలో ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపారు అంగన్వాడీ సంఘాలు. అవి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో సమ్మె ఉధృతం చేస్తామని, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు అంగన్వాడీ కార్యకర్తలు.

Botsa Satyanarayana: అంగన్వాడీల ఆందోళనపై స్పందించిన మంత్రి బొత్స.. జీతాల పెంపుపై ఏమన్నారంటే..
Botsa Satyanarayana
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల నిరసనలు కొనసాగుతున్నాయి. సమ్మె సైరన్ మోగించి వారం గడిచింది. గతంలో ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపారు అంగన్వాడీ సంఘాలు. అవి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో సమ్మె ఉధృతం చేస్తామని, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు అంగన్వాడీ కార్యకర్తలు. ఇదిలా ఉంటే అంగన్వాడీల నిరసనలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతి సారీ తమ ప్రభుత్వం పెంచుతుందని ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ కొలువుదీరిన వెంటనే రూ. 1000 పెంచుతామని హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రూ. 10 వేలు ఇచ్చే వారికి రూ. 11 వేలు ఇస్తున్నట్లు వివరించారు. గతంలో జరిగిన సమావేశాల్లో అంగన్వాడీల 10 డిమాండ్లను అంగీకరించామని తెలిపారు.

ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జీతాలు పెంచే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తోందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజు నుంచి మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేశామన్నారు. టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించినా తమ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ తమ అభ్యర్థులను మార్పులు, చేర్పులు చేస్తూ ముందుక సాగుతుందని తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సమీకరణాల దృష్ట్యా ఇది సర్వసాధారణమన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..