Andhra Pradesh: విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కొనసాగింపుపై జగన్ సర్కార్ దృష్టి..

|

Feb 20, 2024 | 11:37 PM

రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించేలా రాష్ట్రపతి ఉత్తర్వులను కొనసాగించేలా విభజన చట్టంలో పొందుపరిచారు. స్థానిక విద్యార్థులకు అడ్మిషన్లులో ప్రాధాన్యత ఇచ్చేలా 1974 లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులను విభజన తర్వాత పదెళ్లపాటు కొనసాగించేలా విభజన చట్టంలోని 11వ పార్ట్ లోని 95వ పేరాలో స్పష్టం చేశారు. ఈ పదేళ్ల గడువు వచ్చే జూన్ రెండు నాటికి ముగుస్తుంది.

Andhra Pradesh: విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కొనసాగింపుపై జగన్ సర్కార్ దృష్టి..
Ap Government
Follow us on

రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించేలా రాష్ట్రపతి ఉత్తర్వులను కొనసాగించేలా విభజన చట్టంలో పొందుపరిచారు. స్థానిక విద్యార్థులకు అడ్మిషన్లులో ప్రాధాన్యత ఇచ్చేలా 1974 లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులను విభజన తర్వాత పదెళ్లపాటు కొనసాగించేలా విభజన చట్టంలోని 11వ పార్ట్ లోని 95వ పేరాలో స్పష్టం చేశారు. ఈ పదేళ్ల గడువు వచ్చే జూన్ రెండు నాటికి ముగుస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని ఆర్టికల్ 371 D ప్రకారం అన్ని విద్యాసంస్థల్లో ప్రవేశాలకు స్థానికతను ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కావస్తూ ఉండటంతో ఈ ఉత్తర్వులు కొనసాగింపు అవసరమా లేదా అనే దానిపై ఏపీ సర్కారు దృష్టి సారించింది.

ఇటీవల వైద్యారోగ్య శాఖ,ఉన్నత విద్యా శాఖ,న్యాయ శాఖ,జీఏడీ,ఆర్థిక శాఖ అధికారులుతో సీఎస్ జవహర్ రెడ్డి ఈ అంశంపై చర్చించారు. ఇప్పటికే మెడికల్‎తో పాటు ఇతర కోర్సుల్లో అడ్మిషన్లను తెలంగాణ ప్రభుత్వం సొంతంగా నిర్వహించుకుంటుంది. ఏపీ కూడా తెలంగాణ మాదిరిగా ఇదే విధానంలో ముందుకెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కొనసాగింపు కోరడం వల్ల ఎలాంటి లాభం లేకపోగా తెలంగాణతో వివాదాలు సృష్టిస్తుందని నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. దీంతో ఏపీలో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేసేలా కేంద్రానికి నివేదిక పంపాలని నిర్ణయించింది. దీని కోసం సీఎస్ అధ్యక్షతన మొత్తం 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యా సంస్థల్లో అడ్మిషన్లుకు సంబంధించి ప్రజలు, నిపుణులు అభిప్రాయాలు తెలుసుకొని రెండు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిటీ. కమిటీ నివేదికను కేంద్రానికి, రాష్ట్రపతికి పంపనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించడం లేదా కొత్తగా ఉత్తర్వులు జారీ చేసేలా నివేదికను పంపనుంది. అంటే జూన్ తర్వాత రాష్ట్రంలో స్థానికతలో మార్పులు జరిగే అవకాశం ఉంది. వీటన్నింటికీ గతంలో మాజీ టీటీడీ చైర్మెన్, రాజ్యసభ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణంగా కనిపిస్తోంది. విభజన సమయంలో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా 10ఏళ్లు కొనసాగిస్తామన్న నేపథ్యంలో దాని గడువును పెంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామన్నారు. దీంతో ఉమ్మడి రాజధాని అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..