ఏపీ విద్యార్థులకు బిగ్ అప్‌డేట్.. సమ్మర్ హాలీడేస్ పొడిగింపు.. కాలేజీలు ఎప్పుడు తెరుచుకోనున్నాయంటే?

AP Inter Colleges: ఏపీలో జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నేపథ్యంలో జూన్ 6 నుంచి కాలేజీలు ప్రారంభం కానుండగా, పాఠశాలలు జూన్ 12 నుంచి తెరుచుకోనున్నాయి. దీంతో తిరిగి విద్యాలయాలకు వెళ్లేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు.

ఏపీ విద్యార్థులకు బిగ్ అప్‌డేట్.. సమ్మర్ హాలీడేస్ పొడిగింపు.. కాలేజీలు ఎప్పుడు తెరుచుకోనున్నాయంటే?
Ap Inter Colleges

Updated on: May 30, 2026 | 12:45 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతోంది. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్లను రెండు రాష్ట్రాల విద్యాశాఖలు ఇప్పటికే విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ కాలేజీల ప్రారంభ తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది.

మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు తెరుచుకోవాల్సి ఉండగా, ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కారణంగా సెలవులను మరికొన్ని రోజులు పొడిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా నిర్ణయం ప్రకారం జూన్ 5 వరకు సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగనున్నందున, జూనియర్ కాలేజీలు జూన్ 6 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. అయితే ఇప్పటికే ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్‌లోని ఇతర కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక పాఠశాలల విషయానికి వస్తే, విద్యార్థులకు జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 12 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో వేసవి విరామం అనంతరం విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్నారు.

Follow Us