Telugu News Andhra Pradesh News AP Budget 2026 live updates, FM Payyavula Keshav speech, Agriculture Budget, check allocation for all sectors in Telugu
AP Budget 2026 Highlights: ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.53,752 కోట్లు
Andhra Pradesh Budget 2026 updates in Telugu: ఉదయం11 గంటలకు ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
Andhra Pradesh Budget 2026 updates in Telugu: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఫిబ్రవరి 14న ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను తయారు చేసిన ఏపీ సర్కార్.. ఉదయం 11:15గంటలకు ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో కొత్త పథకాలకు సంబంధించి కూడా బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది.
రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు
అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంటే మా దృష్టిలో కేవలం పద్దుల లెక్కలు కాదు అని,భవిష్యత్ పై కొండంత ఆశలు చూపే బడ్జెట్ అంటూ ఆయన ప్రసంగించారు. ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లుగా ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ పరిస్థితులు పూర్తిగా మారాయని ఆయన అన్నారు.
మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం నా అదృష్టం:
ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ను తయారు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వరుసగా మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం నా అదృష్టమని అన్నారు మంత్రి. ఈ బడ్జెట్ రాయలసీమ ప్రజల కలలలను నెరవేరుస్తుందని, యవత ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందన్నారు.
లైవ్ అప్‌డేట్ ఇక్కడ చూడండి:
LIVE NEWS & UPDATES
The liveblog has ended.
14 Feb 2026 01:43 PM (IST)
అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగాలు పూర్తయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు మంగళవారానాకి వాయిదా పడ్డాయి.
14 Feb 2026 01:41 PM (IST)
Agriculture Budget: ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.53,752 కోట్లు
ధాన్యం సేకరణకు సంబంధించి రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లింపు.
పెట్టుబడి రాయితీ కింద రూ.310 కోట్లు కేటాయింపు.
వ్యవసాయ యాంత్రీకరణలో 50 శాతం రాయితీతో రూ.136 కోట్లు.
భూసారాన్ని అంచనా వేయడానికి 6 లక్షల భూసార పరీక్ష పత్రాల అందజేత.
‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంతో 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు.
14 Feb 2026 01:22 PM (IST)
Polavaram Project: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించామన్నారు మంత్రి. అలాగే డయాఫ్రం వాల్ నిర్మాణం ఇప్పటికే 91 శాతం పూర్తి చేశామని, అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు 60 శాతం వరకు పూర్తియినట్లు చెప్పారు. వంశధార-2, హంద్రీనీవా, పూలసుబ్బయ్య వెలిగొండ, పోలవరం పూర్తికి కృషి చేస్తున్నామని, గ్లోబల్ సమ్మిట్‌లో రూ.13.25 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయన్నారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు 97 శాతం పూర్తయ్యాయని, ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు చెప్పారు. పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని, ఉచిత విద్యుత్‌తో లక్షకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
14 Feb 2026 01:05 PM (IST)
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ ప్రాంతమని మంత్రి తెలిపారు. రాయలసీమ కోసం ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ప్లాన్. 2030 నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణం 14.41 లక్షల హెక్టార్లకు విస్తరణ ఉంటుందన్నారు. ప్రపంచ మార్కెట్లతో అనుసంధానికి రోడ్ల కనెక్టివిటీ ఉంటుందని, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హార్టికల్చర్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో ప్రత్యక్షంగా 9 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
14 Feb 2026 01:01 PM (IST)
విశాఖ ప్రాంతీయ ఆర్ధిక జోన్ కి 28,000 కోట్లు
విశాఖ ప్రాంతీయ ఆర్ధిక జోన్ కి 28,000 కోట్లు
విశాఖ జోన్ పరిధిలోకి 10 జిల్లాలు
9 జిల్లాలతో అమరావతి ఆర్ధిక ప్రాంతం
రాయలసీమ గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ కు 30,000 కోట్లు
ప్రతీ జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
14 Feb 2026 12:44 PM (IST)
తగ్గిన రెవెన్యూ లోటు..
2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ.41,118.36 కోట్లు
2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ.22, 002.50 కోట్లు
2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం ద్రవ్య లోటు రూ.80,567.47 కోట్లు
2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్య లోటు రూ.75,868.09 కోట్లు
14 Feb 2026 12:43 PM (IST)
వివిధ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపులు:
వీబీ జీ రామ్ జీ – రూ.8,365 కోట్లు
గృహనిర్మాణం (పట్టణ-గ్రామీణ) – రూ.5,451 కోట్లు
డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్యసేవ ట్రస్ట్ – రూ.4,000 కోట్లు
జల జీవన్ మిషన్ – రూ.4,000 కోట్లు
రీ ప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ – రూ.2,144 కోట్లు
స్వచ్ఛభారత్ మిషన్ – రూ.1,037 కోట్లు
నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ – రూ.955 కోట్లు
ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ – రూ.838 కోట్లు
14 Feb 2026 12:29 PM (IST)
ఏపీ ఆదాయం
సంక్షేమం – 17 శాతం
విద్య – 11 శాతం
ఆర్ధికం – 8 శాతం
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి – 7 శాతం
వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం – 6 శాతం
జలవనరులు – 6 శాతం
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ – 4 శాతం
విద్యుత్ రంగం – 4 శాతం
వ్యవసాయం, అనుబంధ రంగాలు – 4 శాతం
ఇతరాలు (హోం, ఆర్ అండ్ బీ, పరిశ్రమలు…) – 15 శాతం
వడ్డీలు, రుణాల చెల్లింపులు – 18 శాతం
పన్నుల ద్వారా ఆదాయం – 38 శాతం
పన్నేతర ఆదాయం – 3 శాతం
బహిరంగ మార్కెట్ రుణాలు – 30 శాతంకేంద్ర పన్నుల్లో వాటా – 19 శాతం
2026-27 వార్షిక బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా ప్రభుత్వ విధానం: పయ్యావుల
ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా బడ్జెట్: పయ్యావుల
14 Feb 2026 12:03 PM (IST)
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు
రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు
పరిశ్రమలకు రూ.3,161 కోట్లు
సర్దుబాటు నిధి.. రూ.1,500 కోట్లు
జల్ జీవన్‌కు రూ.4,000 కోట్లు
వీబీ జీ రామ్ జీకి.. రూ.8365 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు
ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4000 కోట్లు
స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.1,037 కోట్లు
అమరావతి కోసం రూ.6వేల కోట్లు
అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు
మత్స్యకారులకు రూ.260 కోట్లు
బీసీలకు 23,650 కోట్లు
విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు
9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం
14 Feb 2026 12:01 PM (IST)
ఉన్నత విద్యకు – రూ.2,566 కోట్లు
ఉన్నత విద్యకు – రూ.2,566 కోట్లు
మనబడి మన భవిష్యత్తు-రూ.1,500 కోట్లు
స్కిల్ డెవలప్‌మెంట్ రూ.1,232 కోట్లు
పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా – రూ.707 కోట్లు
14 Feb 2026 11:56 AM (IST)
భవిష్యత్తుకు ఉపయోగపడేలా బడ్జెట్
బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడేలా రూపొందించామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల అన్నారు. ఇప్పటి వరకు ఏం సాధించాం.. ఇంకా ఏం సాధించాలనే అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ బడ్జెట్‌ను తయారు చేసినట్లు చెప్పారు. కాగితాలకే పరిమితం కాకుండా.. క్షేత్ర స్థాయిలో సంక్షేమాన్ని అమలు చేయడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామన్నారు పయ్యవుల.
14 Feb 2026 11:54 AM (IST)
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగంలో ముఖ్యాంశాలు
బడ్జెట్ ప్రవేశపెట్టడమంటే కేవలం ఆదాయ వ్యయాలను వివరించడం కాదు.
ఏపీ రాష్ట్ర ప్రజల ఆశలను నెరవేర్చేందుకు బడ్జెట్ అనేది రోడ్ మ్యాప్ వంటింది.
మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కడం నా అదృష్టం
ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేసేలా ఉంటుంది
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దేలా 2024లో బడ్జెట్ ప్రవేశపెట్టాం.
ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ను తయారు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వరుసగా మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం నా అదృష్టమని అన్నారు. ఈ బడ్జెట్ రాయలసీమ ప్రజల కలలలను నెరవేరుస్తుందని, యవత ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందన్నారు.
14 Feb 2026 11:41 AM (IST)
రెవెన్యూ లోటు బడ్జెట్
2026–27 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు రూ. 22,002.50 కోట్లు
ఆర్థిక లోటు – రూ. 75,868.09 కోట్లు
ప్రాథమిక లోటు – రూ. 38,587.54 కోట్లు
14 Feb 2026 11:34 AM (IST)
స్వర్ణాంద్ర 2047 అనుగుణంగా బడ్జెట్
స్వర్ణాంద్ర 2047కు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ అన్నారు. ఆయన అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ పరిస్థితులు పూర్తిగా మారాయని ఆయన అన్నారు.
14 Feb 2026 11:32 AM (IST)
ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు
ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లుగా ప్రకటించారు.
14 Feb 2026 11:29 AM (IST)
బడ్జెట్ అంటే భవిష్యత్తుపై కొండంత ఆశలు- పయ్యవుల
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంటే మా దృష్టిలో కేవలం పద్దుల లెక్కలు కాదు అని,భవిష్యత్ పై కొండంత ఆశలు చూపే బడ్జెట్ అంటూ ఆయన ప్రసంగించారు.
14 Feb 2026 11:26 AM (IST)
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అనిత
శాసన మండలి శనివారంనాడు ప్రారంభంకాగానే.. హోం మంత్రి అనిత వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
14 Feb 2026 10:58 AM (IST)
ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 11..15 గంటలకు అసెబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
14 Feb 2026 10:03 AM (IST)
అసెంబ్లీలో బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో బడ్జెట్. దాదాపు రూ.3.46 లక్షల కోట్ల అంచనాతో ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సమావేశాలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
14 Feb 2026 09:59 AM (IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.