AP Assembly Sessions 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులంటే.. బీఏసీలో కీలక నిర్ణయం..

|

Jul 22, 2024 | 3:53 PM

అసెంబ్లీ కమిటీ హాలులో బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతోపాటూ ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్నదానిపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి స్పీకర్ తోపాటూ సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఏపీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందకు సిద్దమయ్యారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో జూలై 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది.

AP Assembly Sessions 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులంటే.. బీఏసీలో కీలక నిర్ణయం..
Ap Assembly
Follow us on

అసెంబ్లీ కమిటీ హాలులో బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతోపాటూ ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్నదానిపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి స్పీకర్ తోపాటూ సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఏపీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందకు సిద్దమయ్యారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో జూలై 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. బీఏసీ నిర్ణయం ప్రకారం ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటూ, అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై కూడా అసెంబ్లీలో చర్చ జరిపాలని కమిటీ నేతలు నిర్ణయించారు. అలాగే విపక్షానికి ఎంత సమయం కేటాయించాలన్న దానిపై కూడా చర్చజరిగినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే బీఏసీ సమావేశం నిర్వహించేకంటే ముందే అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కూటమి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. నేతలెవరూ కవ్వింపు చర్చలకు పాల్పడవద్దని సూచించారు. అయితే, ఐదేళ్లలో వైసీపీ కేసులతో ఇబ్బందులు పెట్టిందంటూ ఎమ్మెల్యేలు చెప్పగా.. చట్టం తనపని తాను చేస్తుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇసుక పాలసీలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని కూడా స్పష్టం చేశారు. వైసీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇదే మీటింగ్‌లో డిప్యూటీ సీఎం పవన్‌ కూడా నేతలకు పలు సూచనలు చేశారు. ప్రజలకు చేరువగా పరిపాలన అందించాలన్నారు. ఇసుకతో పాటు, రవాణా రేట్లు ఇంకా తగ్గాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేయాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..