AP News: గుంటూరు లవ్‌ అటాక్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. అసలు మ్యాటర్ ఇదంటూ ఫోటోలు విడుదల..!

|

Jun 03, 2022 | 8:36 AM

AP News: గుంటూరు లవ్‌ అటాక్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకొస్తున్నాయి. ధర్మతేజ, ఆ యువతి ప్రేమించుకున్నట్టు..

AP News: గుంటూరు లవ్‌ అటాక్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. అసలు మ్యాటర్ ఇదంటూ ఫోటోలు విడుదల..!
Love Attack
Follow us on

AP News: గుంటూరు లవ్‌ అటాక్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకొస్తున్నాయి. ధర్మతేజ, ఆ యువతి ప్రేమించుకున్నట్టు.. ఒక్కొక్కటిగా ఆధారాలు విడుదల చేస్తున్నారు అతని కుటుంబసభ్యులు. నిన్న ఆమె ఆత్మహత్యాయత్నం వీడియో విడుదల చేసిన ధర్మతేజ కుటుంబసభ్యులు.. ఇవాళ వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను రిలీజ్‌ చేశారు. ఇప్పుడా ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు యువతి, ఆమె తల్లిపైనా దాడి తర్వాత ఆత్మహత్యాయత్నం చేసిన ధర్మతేజ.. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులు.. త్వరలోనే ధర్మతేజను అరెస్ట్‌ చేయనున్నారు.

తెనాలికి చెందిన ధర్మతేజ తనను ప్రేమించడం లేదని యువతిపై దాడికి దిగాడు. ఆడ్డొచ్చిన ఆమె తల్లిపైనా అటాక్‌ చేశాడు. ఐతే ధర్మతేజ-ఆ యువతి ఇద్దరూ పరస్పరం ఇష్టపడ్డారని.. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారని ధర్మతేజ బంధువుల చెబుతున్నారు. ఆమె పేరెంట్స్‌ ఒప్పుకోకపోవడం వల్లే ధర్మతేజ వాళ్ల ఇంటికి వెళ్లాడంటున్నారు. ఆ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం వుందంటూ వాట్సాప్‌ ఛాటింగ్‌లతో పాటు వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటో, ఓ వీడియోను రిలీజ్‌ చేశారు ధర్మతేజ బంధువులు. తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ ఆ యువతి.. తనను తాను కొట్టుకుంటున్నట్టు దృశ్యాలు ఆ వీడియోలో వున్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే కేసును తప్పుదోవపట్టించడానికి ధర్మతేజ బంధువులు ప్రయత్నిస్తున్నారని యువతి తరపువారు ఆరోపిస్తున్నారు. దీంతో అసలేం జరిగింది? సంచలనం రేపిన ఈ కేసు ఎలాంటి టర్న్‌ తీసుకుంటుంది? ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు వెలుగులోకి రానున్నాయన్నది చర్చనీయాంశంగా మారింది.