Andhra Pradesh: బస్తీమే సవాల్ అంటున్న మంత్రి.. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమంటూ ప్రకటన..

|

Jan 11, 2023 | 9:18 AM

భస్తీమే సవాల్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఓ రేంజ్‌లో మండి పడ్డారు. ఓ వార్తా పత్రికలో తనపై వచ్చిన వార్తలపై తీవ్రంగా స్పందించిన ఆయన..

Andhra Pradesh: బస్తీమే సవాల్ అంటున్న మంత్రి.. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమంటూ ప్రకటన..
Minister Dharamana Prasada Rao
Follow us on

భస్తీమే సవాల్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఓ రేంజ్‌లో మండి పడ్డారు. ఓ వార్తా పత్రికలో తనపై వచ్చిన వార్తలపై తీవ్రంగా స్పందించిన ఆయన.. అసలు రెవిన్యూ మంత్రికి ఉన్న అధికారాలు తెలుసుకొని కథనాలు రాయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోమాట్లాడుతూ.. రెవెన్యూ మంత్రిగా సెంటు భూమి కూడా కేటాయించే అధికారం తనకు ఉండదని, అలాంటిది భూములు దొబ్బే అవకాశం ఉంటుందా? అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర క్యాబినెట్ మాత్రమే ఎవరికైనా భూములు కేటాయించగలదని స్పష్టం చేశారు. తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని సవాల్ చేశారు.

‘ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయడంలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు అవినీతికి పాల్పడ్డాడంటూ ఓ కథనం వేస్తారు.. రెవెన్యూ మినిస్టర్ భూములు దొబ్బాడని ఆరోపణలు చేస్తున్నారు. అసలు, రెవెన్యూ మంత్రికి భూములు దొబ్బే అవకాశం ఉంటుందా? మీరే ఆలోచించండి.’ అంటూ వ్యాఖ్యానించారు. ‘సోషల్ మీడియాలోనే కాదు కొన్ని పత్రికల్లో ఇలాంటి ఆరోపణలు చేస్తారు.. కానీ అందుకు నేనిచ్చే సమాధానం ఆ పత్రికల్లో రాదు. ఇలాంటివి టీవీల్లో రోజూ చూడడం ద్వారా ప్రజలు ప్రభావితులవుతారు. ఒక్క రూపాయి తీసుకున్నానని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని నేను చెప్పిన మాట ఆ పత్రికల్లో రాదు. నా దగ్గర ఓ రిపోర్టర్ ను పెడతారు.. నేను చెప్పినవి అటూ ఇటూ కత్తిరించి మధ్యలో ఉన్న మేటర్ ను పెడతారు. పాపం.. ఆ రిపోర్టర్ ఏం చేయగలడు.. యాజమాన్యం వద్ద అతడో ఉద్యోగి మాత్రమే!’ అంటూ వ్యాఖ్యానించారు మంత్రివర్యులు. అయితే, తనపైనే కాకుండా, తమ ప్రభుత్వంపైన తప్పుడు కథనాలు రాస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..