AP Capital: ఏపీకి మూడు రాజధానులు అంశంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ..

|

May 30, 2021 | 11:09 PM

AP Capital: మూడు రాజధానుల వ్యవహారంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు...

AP Capital: ఏపీకి మూడు రాజధానులు అంశంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ..
Botsa Satya Narayana
Follow us on

AP Capital: మూడు రాజధానుల వ్యవహారంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ఉద్ఘాటించారు. ఆదివారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ అంశాన్నీ నెరవేర్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల హామీల్లో ఇప్పటికే 94 శాతం నెరవేర్చామన్నారు. అదే సమయంలో ఎన్నిక మేనిఫెస్టోలో చెప్పని 40 హామీలను సైతం ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడమే తమ విధానమన్న బొత్స సత్యనారాయణ.. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరతామని పునరుద్ఘాటించారు.

అంతేకాదు.. అవినీతి, అక్రమాల నిర్మూలనే ధ్యేయంగా, ప్రతీ పేదవారికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ చేశామని చెప్పుకొచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం భావిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రెండేళ్ల పాలనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేసిన పుస్తకాన్ని ప్రతీ లబ్ధిదారుడికి చేరవేస్తామన్నారు. రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉందన్నారు.

Also read:

Asian Boxing Championships 2021: ఆసియా ఛాంపియన్‌సిప్‌లో రజతంతో సరిపెట్టుకున్న మేరీకోమ్..